Andhra Pradesh: విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ విమాన సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడ-షార్జా మధ్య రాకపోకలు కూడా ప్రారంభం కావడంతో షార్జా నుంచి విమానం గన్నవరం చేరుకుంది. షార్జా వెళ్లే విమాన సర్వీసును గన్నవరం విమానాశ్రయం నుంచి వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి… టీడీపీ ఎంపీ కేశినేని నానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు షార్జా విమానం ఎక్కిన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు…
Pothula Sunitha: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో హంతకుడు, దగాకోరు, వెన్నుపోటు దారుడు చంద్రబాబు అని అందరికీ తెలుసన్నారు. రెండు ఎకరాల నుంచి ఇంత ఆస్తిని చంద్రబాబు ఎలా సంపాదించారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు సంగతి తెలిసే ఆయన నీచ చరిత్రకు ప్రజలు చరమగీతం పాడారని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తుంటే టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సామాజిక విప్లవకారుడిలా జగన్ సామాజిక…
Vellampalli Srinivas: వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో శుక్రవారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నివాసానికి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ వెళ్లారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాన్ని వర్ల రామయ్య నివాసంలో ఆయన డ్రైవర్‌కు అందజేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చిన సమయంలో వర్ల రామయ్య తన నివాసంలోనే ఉన్నారు. అయితే ఆయన మాత్రం బయటకు…
Sunil Deodhar: ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడారు. 2024లో జరిగే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదన్నారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని చేదు అనుభవాలు చవిచూశామని తెలిపారు. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీతో పొత్తు పెట్టుకోరాదని నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్డు మ్యాప్…
Vallabhaneni Vamsi: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తోక పట్టుకుని ఈదాలనుకుంటున్నారని.. పవన్ తన క్యాడర్‌ను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మంత్రులపై దాడి చేయడం చాలా పొరపాటు అని.. తన క్యాడర్‌కు పవన్ కళ్యాణ్ చాలా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. 6 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న జనసేన ఇలా దాడి చేస్తే 50 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న…
Unstoppable-2 Promo: “సదా నన్ను కోరుకునే మీ అభిమానం… ‘అన్ స్టాపబుల్’ను టాక్ షోలకి అమ్మ మొగుడిగా చేసింది…” అంటూ నటసింహ నందమూరి బాలకృష్ణ విజయగర్జన చేశారు. ఈ ముచ్చట ‘అన్ స్టాపబుల్’ రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ ప్రోమోలో చోటు చేసుకుంది. ఈ ప్రోమో మంగళవారం సాయంత్రం జనం ముందుకు వచ్చింది. దాదాపు ఐదు నిమిషాలు సాగిన ఈ ప్రోమోలో బాలకృష్ణ ఆరంభంలోనే బైక్ పై విచ్చేయడం, ఎంతో హుషారుగా కేకలు వేస్తూ అక్కడ పాల్గొన్న…
Dharmana Prasad Rao: రాజధాని వికేంద్రీకరణ అంశంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రి ధర్మాన ప్రసాదరావు సూటి ప్రశ్నలు వేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. అసలు ఆయన శ్రీకాకుళానికి ఏం చేశారన.. రియల్ ఎస్టేట్ కోసం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటారా అని నిలదీశారు. అమరావతిపై నిధులు ఖర్చు చేస్తే ఉత్తరాంధ్రకు మళ్లీ కష్టాలు తప్పవని ధర్మాన స్పష్టం చేశారు. మూడు రాజధానులతోనే ఏపీ అభివృద్ధి…
Roja Selvamani: తెలుగుదేశం పార్టీపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మరోసారి తనదైన శైలిలో ఫైరయ్యారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ దుశ్శాసనుల పార్టీగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నేతలే అత్యాచారాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని మంత్రి రోజా ఆరోపించారు. యువతులు, మహిళలపై టీడీపీ నేతలు చేసే అరాచకాలపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేత వేధింపుల వల్లే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని మంత్రి రోజా ఆగ్రహం…
JC Prabhakar Reddy: బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయగా.. శుక్రవారం నాడు జేసీ ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఈడీ ముందు హాజరయ్యారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి ఆయన కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈడీ సోదాలు జరిగాయి. అయితే కొద్ది కాలం క్రితమే జేసీ కుటుంబం తమ ప్రైవేటు బస్సుల వ్యాపారాన్ని నిలిపివేసింది. తాజాగా ఈడీ కార్యాలయంలో…