Minister PeddiReddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రి మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సీఎం జగన్ అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించారని.. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఆ వివరాలు చూసుకుని ఏవైనా తప్పులుంటే టీడీపీ నేతలే చెప్పాలని హితవు పలికారు. కొన్ని…
Prathipati Pulla Rao: ఏపీ రాజధాని విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా బుద్ధి రాదని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా.. ఏ కోర్టుకు వెళ్లినా అమరావతి ఒక్కటే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని ప్రత్తిపాటి పుల్లారావు…
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులు రెఫరెండంగా వచ్చే ఎన్నికలకు వెళ్లామంటున్న వైసీపీ ప్రభుత్వం.. దమ్ముంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో డిమాండ్ చేయాలని టీడీఎల్పీలో నిర్ణయించారు. జగన్‌కు అంత నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ సవాల్ విసిరింది. ఈ సందర్భంగా టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు…
Thopudurthi Prakash Reddy: టీడీపీ నేతలకు రాప్తాడు ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సవాల్ చేశారు. తనపై ఐ-టీడీపీ, చైతన్య రథం అనే ఈ పేపర్ ద్వారా గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను హత్యలు చేయించానని రాశారని.. దీనిపై సీఐడీ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై డీఐజీకి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రాజారాం, ఈశ్వరయ్య అనే వ్యక్తులను తాను చంపానని రాశారని.. కానీ వారు బ్రతికే ఉన్నారని తోపుదుర్తి…