Andhra Pradesh: ఇటీవల శ్రీకాళహస్తిలో సీఐ అంజు యాదవ్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు రాంనగర్ కాలనీకి చేరుకున్న ఆమె నిందితుడి భార్య పట్ల శారీరకంగా దాడి చేశారు. అతడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ హింసించారు. సదరు మహిళను దూషిస్తూ బలవంతంగా పోలీస్ వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. తనను సీఐ అంజు యాదవ్ తన్నారంటూ ధనలక్ష్మీ అనే మహిళ ఆరోపించింది. అంతేకాకుండా మహిళను కాలితో తన్నుతూ చీర లాగి,…
Chintamaneni Prabhakar: అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర తాడేపల్లి గూడెం చేరుకుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో కొన్ని ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. అమరావతి టు అరసవెల్లి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఫేక్ రైతులు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే ఈ ఫ్లెక్సీలను స్థానిక మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఏర్పాటు చేయించారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవగాహన లేమితో రాజధానిపై మూడు…
Andhra Pradesh: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలిపిరికి వెళ్లే మార్గంలో గోడలపై వైసీపీ రంగులు, రోడ్లపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై విమర్శలు చెలరేగాయి. గోడలపై ఉన్న దేవుడి బొమ్మలు తొలగించి వైసీపీ రంగులు వేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించింది. తిరుపతి నగరంలోని గోడ చిత్రాలపై జరుగుతున్న ప్రచారం దురుద్దేశపూరితంగా చేస్తున్నారని విమర్శించింది. తిరుపతి నగర వ్యాప్తంగా వెలిసిపోయిన గోడ చిత్రాలను గుర్తించి…
Tammineni Sitaram: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రకు 14 ఏళ్లు పాలించిన టీడీపీ ఏం చేసిందో.. గత మూడేళ్లలో తాము ఏం చేశామో చర్చకు సిద్ధమని.. టీడీపీ సిద్ధంగా ఉందా అని తమ్మినేని ప్రశ్నించారు. గుడ్డిగా విమర్శిస్తున్న వారికి అభివృద్ధి ఏం కనిపిస్తుందని సెటైర్లు వేశారు. ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారని.. ఎవరు ఎలాంటివారో అప్పుడు అచ్చెన్నాయుడికి దద్దమ్మలెవరో తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ చర్చకు అచ్చెన్నాయుడి లాంటి…
Minister Jogi Ramesh: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన విమర్శలకు మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు కూలదోసి అధికారంలోకి వచ్చినప్పుడు బాలకృష్ణ ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ చివరి కోరికను నెరవేర్చలేదని.. పార్టీని లాక్కొని సీఎం పీఠంపై మీ బావ కూర్చోలేదా అని బాలయ్యను మంత్రి జోగి రమేష్ నిలదీశారు. తెలుగు జాతికి ఎన్టీఆర్‌ను దూరం చేసింది ఎవరో చెప్పాలని సూటిగా అడిగారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు…
Anil Kumar Yadav: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై నందమూరి హీరోలు చేసిన ట్వీట్లపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఇప్పుడున్న టీడీపీ నారా వారి పార్టీగా మారిందని.. ఎన్టీఆర్ పేరు ఎత్తే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టుకోలేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాన్ని వైఎస్ఆర్ తెచ్చారని.. ఆ…