Dharmana Prasad Rao: రాజధాని వికేంద్రీకరణ అంశంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రి ధర్మాన ప్రసాదరావు సూటి ప్రశ్నలు వేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. అసలు ఆయన శ్రీకాకుళానికి ఏం చేశారన.. రియల్ ఎస్టేట్ కోసం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటారా అని నిలదీశారు. అమరావతిపై నిధులు ఖర్చు చేస్తే ఉత్తరాంధ్రకు మళ్లీ కష్టాలు తప్పవని ధర్మాన స్పష్టం చేశారు. మూడు రాజధానులతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని మంత్రి ధర్మాన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Also: Supreme Court: ‘జాతీయ జంతువుగా ఆవు’ పిటిషన్ కొట్టివేత
అటు వికేంద్రీకరణ సాధన కోసం విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ రాజధానిగా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని వివిధ సంఘాలు స్పష్టం చేశాయి. విశాఖను పరిపాలన రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని తెలిపాయి. ఈనెల 15న విశాఖ గర్జన నిర్వహిస్తామని పేర్కొన్నాయి. లక్షల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని.. విశాఖ పరిపాలన రాజధానిగా ఆపే ధైర్యం ఎవరికీ లేదని వివిధ సంఘాల నేతలు, మేధావులు సవాల్ విసిరారు.