VijayaSai Reddy: వచ్చే ఎన్నికల్లో తనను ప్రజలు ఓడిస్తే అవే తనకు చివరి ఎన్నికలంటూ కర్నూలు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే వైసీపీ నేతలు స్పందిస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్విట్టర్‌లో స్పందించారు. తనకు కాలం చెల్లిందని చంద్రబాబు స్వయంగా అంగీకరించడం ఆయన రాజకీయ చాణక్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ…
ChandraBabu: టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రోడ్ షోలు, బాదుడే బాదుడు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన నన్నూరు మీదుగా కర్నూలు బైపాస్, బళ్లారి చౌరస్తా, పెద్దపాడు, కోడుమూరు, కరివేముల, దేవనకొండ, దూదేకొండ మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ సాయంత్రం 4 గంటలకు పత్తికొండకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు పత్తికొండలో బహిరంగ సభలో…
Vishakapatnam: విశాఖ భూముల అంశంపై కొన్నిరోజులుగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు రోజుల కిందట వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు దొంగల పార్టీ కబ్జాకోరులు, భూబకాసురులైన గంజాయి పాత్రుడు, పీలా గోవిందు, బండారు, గీతం భరత్, వెలగపూడి రాము ఆక్రమించిన భూముల్ని కక్కించి ప్రభుత్వానికి అప్పగిస్తుంటే అడ్డగోలు బాగోతాలు, వాదనలకు దిగారని.. ఈ ద్రోహుల నుంచి 5 వేల కోట్ల…
JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీతో దురుసుగా ప్రవర్తించారు. కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడం లేదని.. ఇలా అయితే స్పందన కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారంటూ కలెక్టర్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు కలెక్టర్ ముందు పేపర్లు విసిరేసి బీకేర్ ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్‌గా పనికిరావంటూ దుర్భాషలాడారు. జిల్లా కలెక్టర్ తనను బయటకు…
Telugu Desam Party: ఎన్టీఆర్ జిల్లా బెజవాడ టీడీపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం నాడు కేశినేని నాని, దేవినేని ఉమ వ్యతిరేక శిబిరాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న తన ఫార్మ్ హౌసులో టీడీపీ నేతల విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ సెగ్మెంట్‌లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అటు మైలవరం టీడీపీలో గందరగోళం నెలకొంది. దేవినేని ఉమ, తన ఫొటో…
Andhra Pradesh: ఏపీలో ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. అయినా వైసీపీ ఈ అంశంపై ముందుకు వెళ్లి పేరు మార్పుపై జీవో విడుదల చేసింది. తాజాగా ఈ విషయమై టీడీపీ పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టింది. విజయనగరం నియోజకవర్గ కేంద్రంలో 17 వేల పోస్టు కార్డులను సేకరించింది. ఈ పోస్టు కార్డులను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ కార్యాలయాలకు పోస్ట్ చేస్తామని టీడీపీ నేతలు తెలియజేశారు. ఈ సందర్భంగా…
Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన అంశంపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. చంద్రబాబు సరికొత్త నాటకానికి తెరతీశాడని ఆరోపించారు. ఆయన విషపు రాజకీయ కుట్రలో ఇది ఒక కోణమని.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తనపై తానే రాయి విసిరించుకున్నాడని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జగన్ దమ్మున్న నాయకుడు అని.. తనను అరెస్ట్ చేసి జైలుకు పంపినా సంయమనంతో వ్యవహరించి ప్రజల మనసులను…
NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు వ్యక్తిగత భద్రతా అధికారి మధుబాబుకు గాయాలయ్యాయి. దీంతో ఆయన బుగ్గ వెంట రక్తం కారింది. వైద్యులు వెంటనే స్పందించి ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. మరోవైపు ఇదే ఘటనలో చంద్రబాబు పీఎస్‌వోకు కూడా స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి రాయి విసిరిన సమయంలో విద్యుత్…
Telugu Desam Party: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ రిమాండ్‌ను తిరస్కరిస్తూ విశాఖ చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును ఏపీ సీఐడీ హైకోర్టులో సవాల్ చేసింది. దీనితో పాటు గురువారం అయ్యన్న పాత్రుడు వేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరిపింది. ఈ సందర్భంగా సెక్షన్ 467 వర్తించదని ఎలా చెబుతారని విశాఖ కోర్టును హైకోర్టు ప్రశ్నించింది. అయ్యన్నపాత్రుడు, రాజేష్‌లకు నోటీసులు జారీచేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 10వ…