టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వారణాసి’ (Varanasi). భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా జక్కన్నా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. కేఎల్ నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూర్తిస్థాయి IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. జనవరి 9న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ప్రమోషన్లో భాగంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నిజానికి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘సలార్’ సినిమాలోనే ఆమె హీరోయిన్గా నటించాల్సిందట. శృతి హాసన్ చేసిన పాత్ర కోసం మొదట మాళవికనే సంప్రదించారని, ప్రశాంత్ నీల్‌ను కలిసి లుక్ టెస్ట్…
అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘లెనిన్’. ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె ‘భారతి’ అనే పాత్రలో నటిస్తోంది. విడుదలైన పోస్టర్లో భాగ్యశ్రీ అచ్చమైన తెలుగు అమ్మాయిలా, లంగావోణీ ధరించి చేతిలో బంతి పూల మాల పట్టుకుని ఎంతో అందంగా కనిపిస్తోంది. “వెన్నెలల్లే ఉంటాది మా భారతి” అంటూ మేకర్స్ ఆమె పాత్రను పరిచయం చేసిన…
తెలుగు అనే కాదు అన్ని భాషల పరిశ్రమలో ఒకప్పుడు “నిర్మాత” అంటే సినిమాకు ఆత్మ వంటి వారు. కానీ కాలక్రమేణా ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బులు ఇచ్చే ‘క్యాషియర్’ అనే స్థాయికి పడిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నిర్మాణ రంగానికి మళ్ళీ పూర్వ వైభవం, గౌరవం తీసుకువచ్చారు స్వప్న దత్, ప్రియాంక దత్ సిస్టర్స్. వైజయంతీ మూవీస్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని, ‘స్వప్న సినిమా’ బ్యానర్‌తో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న ఈ సోదరీమణులు తాజాగా ‘ఛాంపియన్’ చిత్రంతో మరో…
గతేడాది ‘కిష్కింధపురి’ వంటి సాలిడ్ హారర్ థ్రిల్లర్‌తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఇప్పుడు మరో పవర్ఫుల్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహేష్ చందు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హైందవ’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో కాగడా పట్టుకుని పవర్ ఫుల్ లుక్‌లో శ్రీనివాస్ కనిపిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో…
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మాటల మాంత్రికుడు’గా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్, నేడు అగ్ర దర్శకుల్లో ఒకరు. ఆయన కలం నుంచి వచ్చే ప్రతి మాట ఒక తూటాలా పేలుతుంది. అయితే, ఇంతటి ఘనవిజయం వెనుక ఒక బాధాకరమైన సంఘటన దాగి ఉంది. ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’. 2001లో వెంకటేష్ హీరోగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాగా ఈ సినిమాని జనవరి 1న ఈ సినిమా…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా. మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చిరంజీవిని అత్యంత స్టైలిష్‌గా చూపిస్తూ అనిల్ రావిపూడి కట్ చేసిన ప్రోమోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సినిమాపై అంచనాలు పెంచడంలో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా చిరంజీవి-నయనతార జోడీ సాంగ్స్ ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ‘మెగా విక్టరీ…
నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, చిత్ర యూనిట్ తెలంగాణలో టికెట్ ధరలకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. జనవరి 1వ తేదీ నుండి తెలంగాణ వ్యాప్తంగా చాలా తక్కువ ధరలకే టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. సామాన్య…
బుల్లితెర మీద చిన్న చిన్న సీరియల్స్ తీసి.. అలా అలా బాలీవుడ్ పలు చిత్రాలో సైడ్ క్యారెక్టర్లు చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది మృణాల్ ఠాకూర్. ప్రజంట్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్లో సమానంగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తెలుగులో ‘సీతారామం’ సినిమాలో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఆ సినిమా ఆమె కెరీర్‌ను కొత్త మలుపు తిప్పింది అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత…
తెలుగు వెండితెరపై ఇప్పుడు ‘బూతు’ పురాణం నడుస్తోంది. ఒకప్పుడు పవర్ఫుల్ డైలాగ్స్ అంటే రోమాలు నిక్కబొడుచుకునే గంభీరమైన మాటలు ఉండేవి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరో నోటి వెంట బూతు పడితేనే ఆ డైలాగ్‌కు పవర్ వస్తుందని, సినిమాకు క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ పరిణామం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీస్తోంది. Also Read: Vrushabha Review: వృషభ రివ్యూ.. మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే? సినిమా థియేటర్లోకి వెళ్ళిన…