The Raja Saab: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుంది. తాజాగా మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే ఓపెనింగ్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది, ఈ సినిమా కేవలం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 112 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక హారర్ ఫాంటసీ జోనర్ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే తొలిసారి. ప్రభాస్ మార్కెట్ స్టామినా ఏంటో ఈ నంబర్స్ మరోసారి నిరూపించాయి.
READ ALSO: Odisha Flight Crash: ఒడిశాలో ఘోర ప్రమాదం.. చార్టర్డ్ ఫ్లైట్ కూలి
సాధారణంగా హారర్ సినిమాలకు పరిమితమైన ఆడియన్స్ ఉంటారు, కానీ ప్రభాస్ తన స్టార్ పవర్‌తో ఈ జోనర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ‘హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన హారర్ ఫాంటసీ చిత్రం’గా రాజా సాబ్ రికార్డు నమోదు చేసింది. ఈ సినిమా 112+ కోట్లు (తొలి రోజు) వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులు ఈ చిత్రాన్ని “కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్”గా అభివర్ణిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం, నిర్మాణ విలువలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఒక రకంగా చెప్పాలంటే ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను ఘనంగా ప్రారంభించింది, మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి!
READ ALSO: Panjiri Laddu: ప్రసవం తర్వాత బాలింతల శరీరం త్వరగా కోలుకోవాలంటే ఈ ఒక్క లడ్డూ చాలు..