టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వకముందే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ సరసన ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నిజానికి మాళవిక తెలుగు సినిమా ఎంట్రీ చాలా కాలం క్రితమే జరగాల్సిందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన డెబ్యూ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. అది కూడా తన మొదటి తెలుగు సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఉండాల్సింది అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read : Deepika Padukone : యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన దీపికా పదుకొణె..
మాళవిక తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ దేవరకొండ తో కలిసి ఒక లవ్ స్టోరీలో నటించాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దానికి కారణం విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాకు ప్రాధాన్యత ఇవ్వడమేనని ఆమె వెల్లడించింది. ఆ సమయంలో విజయ్ ‘లైగర్’ సినిమా చేయాలని నిర్ణయించుకోవడం తో ఈ లవ్ స్టోరీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని ఆమె పేర్కొంది. విజయ్ తీసుకున్న ఆ నిర్ణయంతో మాళవిక టాలీవుడ్ ఎంట్రీ అప్పట్లో వాయిదా పడింది. ‘లైగర్’ ఫలితం ఎలా ఉన్నా, ఒకవేళ ఆ లవ్ స్టోరీ కనుక పట్టాలెక్కి ఉంటే విజయ్-మాళవికల జోడీ వెండితెరపై ఒక క్రేజీ కాంబినేషన్ అయ్యేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్ళకి ప్రభాస్ సినిమాతో మాళవిక కల నెరవేరుతుంది.