టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వారణాసి’ (Varanasi). భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా జక్కన్నా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. కేఎల్ నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూర్తిస్థాయి IMAX ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఒక భారీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
Also Read : Allu Arjun : టీ తాగడానికి వెళ్లి చిక్కుల్లో పడ్డ బన్నీ.. భార్య స్నేహ రెడ్డి వీడియో వైరల్
ఈ విజువల్ వండర్‌ను ఏప్రిల్ 9, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం ద్వారా, లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకోవచ్చు అని రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేశారట. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కి, ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ తోడై సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టును పారిస్‌లో టీజర్ ప్రదర్శనతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘వారణాసి’, ఇప్పుడు ఏప్రిల్ 2027 లో థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టించడానికి సిద్ధమవుతోంది.