తెలుగు అనే కాదు అన్ని భాషల పరిశ్రమలో ఒకప్పుడు “నిర్మాత” అంటే సినిమాకు ఆత్మ వంటి వారు. కానీ కాలక్రమేణా ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బులు ఇచ్చే ‘క్యాషియర్’ అనే స్థాయికి పడిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నిర్మాణ రంగానికి మళ్ళీ పూర్వ వైభవం, గౌరవం తీసుకువచ్చారు స్వప్న దత్, ప్రియాంక దత్ సిస్టర్స్. వైజయంతీ మూవీస్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని, ‘స్వప్న సినిమా’ బ్యానర్‌తో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న ఈ సోదరీమణులు తాజాగా ‘ఛాంపియన్’ చిత్రంతో మరో అద్భుత విజయాన్ని అందుకున్నారు. నేటి కాలంలో చాలామంది నిర్మాతలు కేవలం బడ్జెట్ చూసుకుని డైరెక్టర్‌కు అన్నీ అప్పగించేస్తారు. కానీ స్వప్న, ప్రియాంక అలా కాదు. 24 క్రాఫ్ట్స్‌లోనూ వీరి ప్రమేయం ఉంటుంది. కథా చర్చల నుండి కాస్ట్యూమ్స్ వరకు, మ్యూజిక్ నుండి మార్కెటింగ్ వరకు ప్రతి విషయంలోనూ వీరు భాగమవుతారు. అందుకే వీరి బ్యానర్ నుండి ఏ సినిమా వచ్చినా అది “నిర్మాత సినిమా” అనిపించుకుంటుంది. డైరెక్టర్ ఎవరైనా సరే, అవుట్‌పుట్‌లో వైజయంతీ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది.
Also Read : Allu Arjun : బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. అట్లీ తర్వాత లోకేష్ కనగరాజ్‌తో?
కేవలం ఒకే ఒక్క సినిమా (పెళ్లిసందD) అనుభవం ఉన్న యంగ్ హీరో రోషన్ మీద ఏకంగా 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పెట్టడమంటే మామూలు విషయం కాదు. కానీ కథపై ఉన్న నమ్మకంతో వీరు ఆ సాహసం చేశారు. అందరికీ తెలిసిన ‘రజాకార్’ హిస్టరీని ఒక స్పోర్ట్స్ డ్రామాగా మలిచిన తీరు అద్భుతం. చరిత్రను, క్రీడను ముడిపెట్టి దర్శకుడు ప్రదీప్ అద్వైతం రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సినిమా ద్వారా అనస్వర రాజన్‌ను తెలుగు తెరకు పరిచయం చేసి, మరోసారి తమ ‘కాస్టింగ్’ టేస్ట్‌ను నిరూపించుకున్నారు. ముందు మహానటి అనే ఒక బయోపిక్‌తో సంచలనం సృష్టించారు.
Also Read : Peddi : రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్!
అనంతరం సీతారామం అంటూ ఒక క్లాసిక్ లవ్ స్టోరీని అందించారు. కల్కి 2898 AD సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటారు. ఇక ఇప్పుడు ‘ఛాంపియన్’తో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అశ్వనీదత్ కి తగిన వారసురాళ్లుగా నిరూపించుకుంటూనే, పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. చిన్న సినిమా తీసినా, భారీ పాన్ ఇండియా సినిమా తీసినా అందులో వీరి కష్టం, ప్యాషన్ కనిపిస్తుంది. క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తూనే సినిమాను ట్రాక్‌లో ఉంచే వీరి శైలి వల్లే ‘ఛాంపియన్’ ఈరోజు బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. నిర్మాతల కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.