పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. జనవరి 9న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నిజానికి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్’ సినిమాలోనే ఆమె హీరోయిన్‌గా నటించాల్సిందట. శృతి హాసన్ చేసిన పాత్ర కోసం మొదట మాళవికనే సంప్రదించారని, ప్రశాంత్ నీల్‌ను కలిసి లుక్ టెస్ట్ కూడా ఇచ్చానని ఆమె తెలిపింది. అన్నీ అనుకూలించినట్టే అనిపించినా,
Also Read : Dhurandhar : రణ్‌వీర్ ‘ధురంధర్’కు సౌత్ స్టార్ ఫిదా..
కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చేజారింది, ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో డెబ్యూ చేసే ఛాన్స్ పోయినందుకు అప్పట్లో చాలా బాధపడ్డానని ఎమోషనల్ అయ్యింది. అయినప్పటికి ప్రభాస్ సినిమాతోనే తెలుగులోకి రావాలని తన విధిరాతలో రాసిపెట్టి ఉందని మాళవిక సంతోషం వ్యక్తం చేసింది. ‘సలార్’ అవకాశం పోయిన కొద్ది నెలలకే మళ్లీ ‘రాజా సాబ్’ కోసం పిలుపు వచ్చిందని, వెంటనే ఓకే చెప్పేశానని వివరించింది. ఈ సినిమాలో తాను ‘భైరవి’ అనే పాత్రలో నటిస్తున్నానని, ఇందులో గ్లామర్‌తో పాటు యాక్షన్ మరియు కామెడీ సీక్వెన్సులు కూడా ఉంటాయని పేర్కొంది. బాహుబలి కంటే ముందు నుంచే తాను ప్రభాస్ ఫ్యాన్ అని, తన కంటే తన తల్లికి ప్రభాస్ అంటే ఇంకా ఇష్టమని ఆమె సరదాగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.