అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘లెనిన్’. ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె ‘భారతి’ అనే పాత్రలో నటిస్తోంది. విడుదలైన పోస్టర్‌లో భాగ్యశ్రీ అచ్చమైన తెలుగు అమ్మాయిలా, లంగావోణీ ధరించి చేతిలో బంతి పూల మాల పట్టుకుని ఎంతో అందంగా కనిపిస్తోంది. “వెన్నెలల్లే ఉంటాది మా భారతి” అంటూ మేకర్స్ ఆమె పాత్రను పరిచయం చేసిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నప్పటికీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీని తీసుకున్నారు.
Also Read : OTT : భారీ బడ్జెట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్ 5 OTT సిరీస్‌లు ఇవే!
మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్కినేని నాగార్జున మరియు నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ గ్రామీణ కథలో అఖిల్ ఊర మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, భాగ్యశ్రీ తన సంప్రదాయబద్ధమైన లుక్‌తో ప్రేక్షకులను మైమరపిస్తోంది. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక జనవరి 5న ఈ మూవీ నుంచి మొదటి పాట (ఫస్ట్ సింగిల్) విడుదల కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కాబోతోంది.