రెబల్ స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందనే దీనిపై నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే రీసెంట్గా ప్రభాస్ కాస్త సన్నబడి, మీసకట్టుతో కనిపించిన లుక్ చూసి అభిమానులు ఇదే ఫైనల్ అంటున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఫ్యాన్స్‌కు అసలైన షాక్ ఇంకా ముందే ఉందట.…
ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వస్తున్న ‘ది రాజాసాబ్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కామెడీ హారర్ థ్రిల్లర్‌లో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన రిద్ధితో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కూడా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ రిద్ధి కుమార్ అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజ్‌పై ఆమె మాట్లాడుతూ ప్రభాస్ తనకు…
సినీ పరిశ్రమలో నటులకు కోట్లాది రూపాయల పారితోషికాలు, లగ్జరీ కార్లు, సమాజంలో గౌరవం లభిస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం సగటు ప్రేక్షకులు. అభిమానులు తమ కష్టార్జితాన్ని వెచ్చించి థియేటర్లకు వస్తేనే ఇండస్ట్రీ కళకళలాడుతుంది. కానీ, తాజాగా సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపుపై స్పందిస్తూ.. ‘సినిమాలు చూడకండి, ఎవడి వ్యాపారం వాడిది’ అంటూ నిర్లక్ష్యంగా…
తాజాగా విడుదలైన వరుస సినిమాలో ‘ఛాంపియన్’ ఒకటి. యంగ్ హీరో రోషన్ మేక తన లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’ తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఈ సినిమా చూసిన టాలీవుడ్ లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్, రోషన్ నటనకు పూర్తిగా ఫిదా అయిపోయారు. దీంతో స్వయంగా రోషన్‌ను కలిసి అభినందనలు తెలపడమే కాకుండా, తన సొంత బ్యానర్ ‘గీతా ఆర్ట్స్’లో ఒక సినిమా చేసేందుకు ఆఫర్ ఇచ్చారు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ నుంచి ఇలాంటి…
Maruthi: జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ కొత్త సినిమా ‘రాజా సాబ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్, కైతలాపూర్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్‌తో కలిసి ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో భాగంగా డైరెక్టర్ మారుతి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. READ ALSO: Pawan Kalyan : కొండగట్టు అంజన్న సన్నిధికి…
నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ సినిమా వేడుకలో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ కావడమే కాకుండా, ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లోని మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ, తన వివరణ ఇచ్చిన క్రమంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తను అనవసరంగా సలహాలు ఇచ్చానని, ఇకపై ఎవరికీ ఎలాంటి సూచనలు చేయకూడదని అర్థమైందని శివాజీ పేర్కొన్నారు.…
నటి మీనా తన కూతురు నైనిక ప్రైవసీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో మీనా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. విజయ్ నటించిన ‘తేరి'(తెలుగులో పోలీసోడు) సినిమాతో బాలనటిగా అందరి మనసు గెలుచుకుంది మీనా కూతురు నైనిక. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆమె పెద్దగా వెండితెరపై కనిపించలేదు. కేవలం ఒకటీ అరా సినిమాలు మాత్రమే చేసింది. తన కూతురు సాధారణ జీవితాన్ని గడపాలని,…
ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య తారాగణంతో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వచ్చిన మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి…
Shambala Day 1 Collection: హీరో ఆది సాయి కుమార్ కెరీర్లోనే ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘శంబాల’ నిలిచింది. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా స్టార్టింగ్ నుంచి పాజిటివ్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రీమియర్ల నుంచి మొదలైన పాజిటివ్ టాక్ డే వన్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాపించింది. ప్రస్తుతం ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా షోలు, స్క్రీన్లు పెరుగుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.…
‘దండోరా’ సినిమా ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద చిచ్చు రేపాయి. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అవ్వడం, శివాజీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా ఈ అంశంపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. లూలూ మాల్లో వేధింపులకు గురైన నటినే తప్పుబట్టడం అత్యంత దిగ్భ్రాంతికరమని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి దుస్తులను సాకుగా చూపిస్తూ నేరస్తుల ప్రవర్తనను…