UstaadBhagatSingh Review : ఉస్తాద్ ఓవర్శీస్ రివ్యూ.. ఇలా అయితే ఎలా హరీష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో దశాబ్దం తర్వాత వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కాగా నేడు ఉదయం ప్రీమియర్ షోస్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా చూసిన ఆడియెన్స్ నుండి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఒక కమర్షియల్ సినిమాకు అద్భుతమైన కథ ఉండక్కర్లేదు కానీ, కనీసం కథనంలో అయినా కొత్తదనం ఉండాలి. కానీ ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు రొటీన్ కథతో సాగిందని కొన్ని చోట్ల హీరో ఎలివేషన్ సీన్లు మాస్ ఆడియన్స్‌ను అలరించినప్పటికీ సినిమా మొత్తంగా చూస్తే ఒక ఫ్లో అనేది కనిపించదు. ఏదో కొన్ని సీన్లను కలిపి ఒకచోట కుట్టినట్లుగా అనిపిస్తుంది తప్ప, ఒక పవర్ స్టార్ సినిమా చూస్తున్న అనుభూతి కలగదని ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్.
ఇక దర్శకుడు హరీష్ శంకర్ తన మార్క్ కామెడీ మరియు కమర్షియల్ డైలాగ్స్‌తో మ్యాజిక్ చేయడంలో ఈసారి విఫలమయ్యారు. గత సినిమాల్లో ఉన్నంత కామెడీ ఇందులో ఎక్కడా కనిపించదు. ఇక సంగీత దర్శకుడు థమన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను లేపడానికి ప్రయత్నించినప్పటికీ, అసలు కథలోనే బలం లేకపోవడంతో తన వంతుగా ఎదో చేయాలని ప్రయత్నించాడు. సినిమాలో పవన్ కళ్యాణ్ కొన్ని సీన్లలో ఆకట్టుకున్నప్పటికీ, ఆయన ట్రేడ్ మార్క్ ఎనర్జీ మాత్రం అక్కడక్కడా మిస్ అయినట్లు అనిపిస్తుంది. మొత్తానికి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎటువంటి కొత్తదనం లేని బోర్ కొట్టించే ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మిగిలిపోయిందని ఓవర్సీస్ నుండి వచ్చిన టాక్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎలాంటి టాక్ తెచుకునుందో చూడాలి.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!