Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా షోలు రద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 బుధవారం సాయంత్రం షోస్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. కానీ రీజనల్ లాంగ్వేజ్ ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ధురంధర్ 2 రిలీజ్ కు బ్రేక్ వేశారు మేకర్స్. రెండు తెలుగు స్టేట్స్ లో భారీ ఎత్తున రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తెలుగు వెర్షన్ షోలు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయి.
Also Read : PK Vs RS : పవన్ కళ్యాణ్ Vs రణవీర్ సింగ్.. బాక్సాఫీస్ వద్ద ‘హ్యాట్రిక్’ క్లాష్!
Also Read
సినిమా విడుదలకు ముందు జరిగిన పరిణామాలే ఈ గందరగోళానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తెలుగు మరియు తమిళ వెర్షన్లకు సంబంధించిన డబ్బింగ్ పనులు ఆఖరి నిమిషం వరకు పూర్తికాకపోవడంతో కంటెంట్ డెలివరీలో తీవ్ర జాప్యం జరిగింది. దీనివల్ల బుధవారం రాత్రి పడాల్సిన పెయిడ్ ప్రీమియర్ షోలు కూడా రద్దయ్యాయి.ఈ రోజు సినిమా గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లకు ఇంకా డిజిటల్ ప్రింట్లు అందలేదు. సాంకేతిక సమస్యల కారణంగా థియేటర్లలో షోలు ప్రదర్శించడానికి వీలు పడటం లేదు. ఫలితంగా నేడు కూడా తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ షోలు పడటం కష్టంగానే కనిపిస్తోంది.ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో కేవలం హిందీ వెర్షన్‌ను మాత్రమే సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శిస్తున్నారు. తెలుగు వెర్షన్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి థియేటర్ యాజమాన్యాలు రీఫండ్ ఇస్తున్నాయి లేదా హిందీ వెర్షన్ చూసేందుకు అనుమతిస్తున్నాయి. సెన్సార్ బోర్డు సూచించిన మార్పుల వల్ల ఆఖరి నిమిషంలో కొన్ని సీన్లను ఎడిట్ చేయాల్సి రావడం, దానివల్ల డబ్బింగ్ ఫైల్స్ మిక్సింగ్‌లో తేడా రావడమే ఈ సాంకేతిక సమస్యకు అసలు కారణమని సినీ వర్గాలు చెప్తున్నాయి. పరిస్థితి త్వరలోనే చక్కబడి రేపటి నుండి తెలుగు వెర్షన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!