Ustaad Bhagat Singh: ఉస్తాద్ హైలెట్స్.. బాక్సాఫీస్ బద్దలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా థియేటర్లోకి రానుంది. పవన్-హరీష్ శంకర్ నుంచి గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో మాస్ ఎలిమెంట్స్‌కు కొదవలేదని.. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ చెప్పేశాయి. అయితే, రిలీజ్‌కు ముందే ఈ సినిమా టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ అంటూ.. సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ హైలైట్స్, సెన్సార్ టాక్.. పవన్ అభిమానులు పండగ చేసుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఉస్తాద్ ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ అని అంటున్నారు.
Also Read: Pawan Kalyan: ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్.. అంతా ఉత్తిదే!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఈ సినిమాలో మొత్తం నాలుగు భారీ ఫైట్లు ఉండబోతున్నాయట. ఫస్ట్ హాఫ్‌లో రెండు, సెకండ్ హాఫ్‌లో రెండు ఫైట్స్.. థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమనే టాక్ నడుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్‌తో కూడిన ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోతుందట. అలాగే.. పవన్ కెరీర్‌లోనే ఎవర్‌గ్రీన్ హిట్ ‘తొలిప్రేమ’ సినిమాలోని ‘మనసై’ సాంగ్‌ను ఈ చిత్రంలో రీమిక్స్ చేసినట్టు టాక్. ఈ పాట థియేటర్లు రీసౌండ్ వచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఇంటర్వెల్ ఫైట్ సినిమా సెకండ్ హాఫ్ మీద అంచనాలను పెంచేలా చాలా ఎమోషనల్‌గా మరియు పవర్ ఫుల్‌గా ఉంటుందట. అలాగే.. సెకండ్ హాఫ్‌లో వచ్చే చైల్డ్ సెంటిమెంట్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణం పోస్తుందని, ఇది మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందని విశ్లేషిస్తున్నారు. దేఖ్ లేంగే సాలా సాంగ్‌లో పవన్ స్టెప్పులు థియేటర్లను హోరెత్తించడం ఖాయమంటున్నారు. మొత్తానికి పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉస్తాద్ భగత్ సింగ్ ఉందని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. అయితే, సినిమా అసలు టాక్ బయటికి రావాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే!
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!