ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రేపు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోర్డింగుల వార్ నడుస్తోంది. మోడీ రాకను వ్యతిరేకిస్తూ గులాబీ పార్టీవాళ్లు క్రియేటివ్‌గా హోర్డింగులను ఏర్పాటుచేస్తున్నారు. ‘సాలు మోడీ.. సంపకు మోడీ’ అని రాసి ఉన్న బ్యానర్లను, హోర్డింగ్‌లు ఇప్పటికే నగరంలోని పలు చోట్ల ఏర్పాటు చేశాయి.. ఇది హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాలేదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. అయితే,…
క్రమంగా పెరిగిపోతున్న పెట్రో ధరలతో ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు.. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.. ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లు సైతం హైదరాబాద్ రోడ్లపై దర్శనమిస్తున్నాయి.. అయితే, వాటిని సదరు వినియోగదారుడు ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది.. బయటకు వెళ్లే ఛార్జింగ్ సెంటర్లు పెద్దగా అందుబాటులో ఉన్న పరిస్థితి లేదు.. దీంతో ఎలక్ట్రిక్ వాహనదాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఎక్కడికి వెళ్లినా.. ఛార్జింగ్ కిట్‌ను వెంట తీసుకెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు.. అంటే,…
ప్రధాని నరేంద్ర మోడీ భద్రత కోసం పోలీస్ రివ్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు.. 4 అంచల భద్రత ఏర్పాటు చేశారు.. వీఐపీ సెక్యూరిటీ, అప్పర్, లోయర్, మిడిల్ ఇలా ప్రధాని మోడీ చుట్టూ ఎస్పీజీ ఫోర్స్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సాయుధ బెటాలియన్ దళాలు మోహరించనున్నాయి..
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి కి చెందిన శంకరయ్య ముంబయి విమానాశ్రయం నుండి బయటికి వస్తుండగా కిడ్నాప్ కు గురయ్యాడు. జూన్ 22న కిడ్నాప్ గురయ్యాడు. అయితే తనను వదిలిపెట్టాలంటే 15లక్షలు డిమాండ్ చేస్తూ.. శంకరయ్య కాళ్లు చేతులు కట్టేసి ఉన్న ఫొటోను ఆయన కుమారుడు హరీష్‌కు వాట్సాప్ చేశారు. అంతేకాకుండా.. ఆ డబ్బు మొత్తం ఇవ్వాల్సిందేనని.. ఎక్కడికి తెచ్చి ఇస్తారో చెప్పాలని హరీష్‌కు ఇంటర్ నెట్ ద్వారా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు కిడ్నాపర్లు.…
టీడీపీని స్థాపించిన అనతి కాలంలోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి తెచ్చి చరిత్ర సృస్టించారు.. ఎన్టీఆర్ అసలైన హీరో, ఆయన దేవుడంటూ వ్యాఖ్యానించారు బీజేపీ నేత బిప్లవ్‌దేవ్.
తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు సిద్ధం అయ్యింది బీజేపీ అధినాయకత్వం.. పార్టీ శ్రేణులు ఎక్కడా నిరుత్సాహ పడకుండా.. వారిలో అదే జోష్ కొనసాగేలా.. కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. అందులో భాగంగానే హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు
> నేటి నుంచి దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే ఐదేళ్ల జైలుశిక్ష > నెల్లూరు జిల్లా వెంకటాచలంలో నేడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి > నేడు రాజమండ్రిలో మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటన > నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ రిమాండ్ గడువు > ఇవాళ నుంచి పెరుగనున్న తిరుమల-తిరుపతి మధ్య ఆర్టీసీ ఛార్జీలు.. రూ.75 నుంచి రూ.90కి…
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మరోసారి నంబర్ వన్‌గా నిలిచింది.. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఏపీ టాప్ స్పాట్లో నిలిచి సత్తా చాటింది.. ఈ జాబితాలో టాప్ ఎచీవర్స్‌లో 7 రాష్ట్రాలను ప్రకటించింది కేంద్రం.
కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా కు టీఆర్ ఎస్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మా పార్టీ మద్దతు సిన్హాకే అంటూ ట్వీట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే 27న సిన్హా నామినేషన్ దాఖలుకు కేటీఆర్ కూడా హాజరవ్వడం చర్చనీయాశంగా మారింది. అంటే యశ్వంత్ సిన్హాకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించింది టీఆర్ ఎస్. ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా జూలై…