హైదరాబాద్‌లో నిన్న, మొన్న రెండు రోజుల పాటు భారీఎత్తున జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా విజయవంతమయ్యాయి. దీంతో తెలంగాణలోని కమలదళంలో అడుగడుగునా ఆ సంతోషం, ఆనందం కనిపిస్తోంది. అయితే ఈ సమావేశాల్లో వేదిక పైన వెనక (రెండో) వరుసలోని సరిగ్గా మధ్యలో కూర్చున్న పార్టీ యువ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాత్రం డల్‌గా ఉండిపోయారు. మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని భుజం తట్టి అభినందిస్తున్న సమయంలో…
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణకు చేసింది ఏమి లేదని, తాగి ఫామ్ హౌజ్‌లో పడుకోవడమే తెలుసని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ్టికి 113వ రోజు చేరింది. ఇందులో భాగంగా ఆమె హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం పరెడ్డి గూడెం గ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. గ్రామస్థులతో వైఎస్ షర్మిల ముచ్చటించిన షర్మిళ ఆమె మాట్లాడుతూ.. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న…
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గమ్మకు హైదరాబాద్‌లోని మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు బంగారు బోనం సమర్పించనున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమీటీ దుర్గమ్మకు బంగారు బోనంతో పాటు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఛైర్మన్ రాకేష్ తివారీ వెల్లడించారు. మేళతాళాలతో , కోలాటాలతో, బేతాల వేషాలతో బ్రహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి…
బీజేపీ బహిరంగకు సుమారు 10లక్షల మందికి పైగా జనసమీకరణ, మరోవైపు దేశ ప్రధాని హాజరవనున్న సభ. అయితే బీజేపీ నేడు నిర్వహించదల్చిన భారీ బహిరంగ సభకు వాన టెన్షన్ పట్టుకుంది. కాగా. నిన్నటి నుంచి హైదరాబాద్ లో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భాజపా శ్రేణులు భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టారు. అయితే సభలకు ముందువరకు సాధారణంగా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావడంతో గురువారం నుంచి…
> హైదరాబాద్: ఈరోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ.. హాజరుకానున్న ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. > హైదరాబాద్: ఈరోజు రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్న ప్రధాని మోదీ.. పరేడ్ గ్రౌండ్స్ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లనున్న మోదీ.. ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు రాజ్‌భవన్ రోడ్డు మూసివేత >…
బీజేపీ అనుకూల ప్రకటనలు… కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఆయన స్టైల్. రేవంత్ అంటే వ్యతిరేకత లేదంటారు. కానీ హస్తం పార్టీలో మాత్రం చేరలేదు. చివరికి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఊరించి, ఊరించి కమలం జెండా వైపు మొగ్గిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా బీజేపీనే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య ఉన్న బంధం ఏమిటనేది తెలియదు కానీ, పిసిసి…
పార్టీలు మారుతున్నా ఫలితం లేదు. ఎన్ని కండువాలు మార్చినా పదవి దక్కటం లేదు. అన్ని పార్టీలను ఓ రౌండ్ వేసిన ఆయన, చివరికి హస్తం గూటికి చేరారు. ఇక్కడైనా ఉంటారా? లేక మరో గూటికి చేరతారా? పూటకో పార్టీలో చేరితే, కేడర్ పరిస్థితేమిటనే చర్చ నడుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి మంత్రిగా పనిచేసిన బోడ జనార్థన్ మరోసారి పార్టీ మారారు. తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీలు మార్చడంలో ఆయన రికార్డు చెరిగిపోనిదనే టాక్…
అప్పట్లో ఆ నియోజకవర్గం హస్తానికి కంచుకోట.ఇందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ చెప్పుకోదగ్గ నేత ఒక్కరూ కనిపించటం లేదట. ఒక్కరైనా దొరకరా అని అధిష్టానం ఎంత వెతికినా ప్రయోజనం లేదట. మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేయటం ఆ పార్టీ పెద్ద టాస్క్‌లా మారిందట.. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో బలంగా ఉండేది. కాంగ్రెస్ తరపున సునీతా లక్ష్మారెడ్డి గతంలో మూడు సార్లు వరుసగా గెలుపొందారు.…