ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఇక్కడే మకాం వేయనున్నారు.. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్న ఆయన.. ఈ నెల 3వ తేదీన సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు.. ఇక, రెండు రోజుల పాటు ఆయన నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్నారు.. అయతే, ప్రధాని టూర్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు జరుగున్నాయి.. వీఐపీ & వీవీఐపీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.. దీనికోసం ఇప్పటికే ఎప్పీజీ రంగంలోకి దిగింది.. నగర విభాగాల పోలీసు బలగాలతో పాటు, నోవాటెల్ హోటల్ చుట్టూ ఇతర ప్రాంతాల నుండి అదనపు బలగాలు మోహరించారు.. ఇప్పటికే నోవేటెల్ హోటల్ చుట్టూ నాలుగు అంచాల వీఐపీ భద్రత ఏర్పాటు చేశారు.. శాంతిభద్రతల పరిస్థితిపై ఎస్పీజీ బృందం ఎప్పటికప్పుడు తెలంగాణ పోలీసులతో కో-ఆర్డినేట్ చేస్తోంది.
Read Also: CPI Narayana: గడ్డం పెంచినంత మాత్రానా సన్యాసి కాదు.. నారాయణ సటైర్
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ భద్రత కోసం పోలీస్ రివ్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు.. 4 అంచల భద్రత ఏర్పాటు చేశారు.. వీఐపీ సెక్యూరిటీ, అప్పర్, లోయర్, మిడిల్ ఇలా ప్రధాని మోడీ చుట్టూ ఎస్పీజీ ఫోర్స్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సాయుధ బెటాలియన్ దళాలు మోహరించనున్నాయి.. అదనంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, రాష్ట్ర- నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మరియు ఆక్టోపస్ బృందాలు ప్రధాని భద్రతలో నిమఘ్నం అవుతాయి.. ప్రధాని నరేంద్ర మోడీ భద్రతో హైడ్ సెక్యురిటీ ( కంటికి కనిపించకుండ మెరుపు దాడి చేసే భద్రత వలయం), పిటింగ్ (వేరీ షార్ప్ ఇంటలిజెన్స్, షార్ప్ షూటర్, ఆక్టివ్, విత్ ఆఫీసర్స్ గైడ్ లైన్స్ ), ల్వోల్టా సెక్యురిటీ ( హై రిస్క్ స్కిల్స్ సెక్యూరిటీ గార్డ్స్ ), స్నిపర్ డాగ్ , బాంబ్ స్క్వాడ్ బృందాలు , ముఫ్తీ పార్టీలకు త్వరిత ప్రతిస్పందన బృందాలు ( ఎస్బీ, ఇంటలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ బ్యూరో ) మోహరిస్తారు.. అంతే కాదు, ఇంకా ఇప్పటికీ కూడా నగరంలో భద్రతా ఏర్పాట్లను అంచనా వేస్తూనే ఉన్నాయి ఎస్పీజీ బృందాలు.. ఎస్పీజీ బ్లూ బుక్ గైడ్ లైన్స్ ప్రకారం భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండనున్నాయి..
ప్రధాని పర్యటన నేపథ్యంలో కనివిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాటు జరుగుతున్నాయి.. ఓవైపు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ సర్కార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా పరిస్థితి ఉంది.. ఇదే సమయంలో.. బైబై మోడీ లాంటి క్యాంపెయిన్‌లో సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.. మరోవైపు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఫ్లెక్సీ, హోర్డింగ్‌ల వార్ కూడా నడుస్తోంది.. ఇక, అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా తాజాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసమే జరిగింది.. ఇవన్నీ బేరుజువేసుకుని భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.