కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా కు టీఆర్ ఎస్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మా పార్టీ మద్దతు సిన్హాకే అంటూ ట్వీట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే 27న సిన్హా నామినేషన్ దాఖలుకు కేటీఆర్ కూడా హాజరవ్వడం చర్చనీయాశంగా మారింది. అంటే యశ్వంత్ సిన్హాకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించింది టీఆర్ ఎస్. ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా జూలై 2న రాష్ట్ర పర్యటనకు రానున్నారు.
కాగా.. 2న ఉదయం 11.30 గంటలకు నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్న యశ్వంత్ సిన్హా.. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లుగా ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో జలవిహార్ లో సమావేశం అవుతారు. తెలంగాణ సీఎం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ భేటీకి అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలతో లంచ్ భేటీ జలవిహార్ లోనే నిర్వహించారు. కాగా.. తెలంగాణ భవన్‌లో కాకుండా మరోచోట లంచ్ మీటింగ్ ఉంటుందని ఎక్కడ సమావేశమయ్యేది ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని యశ్వంత్ సిన్హా ప్రచార కమిటీ సభ్యుడు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.. అయితే.. సిన్హాకు మద్దతునిస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతోనూ ఆయన విడిగా భేటీ కానున్నారు.
Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేరు మార్పుకు ఉద్దవ్ క్యాబినెట్ ఆమోదం