BJP National Executive Meeting: ప్రధాని మోడీ రాక.. సిటీలో హోర్డింగుల కాక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రేపు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోర్డింగుల వార్ నడుస్తోంది. మోడీ రాకను వ్యతిరేకిస్తూ గులాబీ పార్టీవాళ్లు క్రియేటివ్‌గా హోర్డింగులను ఏర్పాటుచేస్తున్నారు. ‘సాలు మోడీ.. సంపకు మోడీ’ అని రాసి ఉన్న బ్యానర్లను, హోర్డింగ్‌లు ఇప్పటికే నగరంలోని పలు చోట్ల ఏర్పాటు చేశాయి.. ఇది హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాలేదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. అయితే, వాటిని వెంటనే అధికారులు, సిబ్బంది తొలగించారు.
Read Also: Electric Vehicle: ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. గ్రేటర్‌లో పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లు..!
Also Read
తాజాగా హైదరాబాద్‌లో ప్రదర్శించిన ఓ హోర్డింగులో ప్రధాని మోడీని ఇంకా హార్డ్‌గా టార్గెట్ చేశారు. దొంగల ముఠా ఫొటో పెట్టి దానిపై ‘మిస్టర్ ఎన్.మోడీ.. మేం బ్యాంక్‌లను మాత్రమే దోచేస్తాం.. కానీ, మీరు ఈ దేశాన్ని మొత్తాన్ని దోచేస్తారు.. అని రాశారు. అయితే, ఈ భారీ ఫ్లెక్సీలను ఎవరు పెట్టారో తెలియదు.. కానీ, పెద్ద చర్చగా మారాయి.. దీంతో, వెంటనే వాటిని తొలగించారు అధికారులు.
కాగా, తెలంగాణలో సీఎం కేసీఆర్, ఆయన మంత్రులు ఆలీబాబా 40 దొంగల ముఠాలా తయారయ్యారంటూ కమలదళం రెండు రోజుల కిందట ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ పార్టీ పాలనకు రాష్ట్ర ప్రజలు రాంరాం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని కూడా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఇంటికి సాగనంపాలని పిలుపునిస్తూ ‘చాలు దొర.. సెలవు దొర’ అనే పేరుతో టీ-బీజేపీ ఒక ప్రత్యేక వెబ్ సైట్‌ను ప్రారంభించింది. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ కూడా సరిగ్గా అవే వ్యాఖ్యలతో బీజేపీ విమర్శలను తిప్పకొడుతోంది.
ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కూడా ఆలీబాబా దొంగల ముఠాతో పోల్చుతూ లేటెస్టుగా హోర్డింగ్ పెట్టారు. ఆ ప్రచార చిత్రంపైన అధికారికంగా టీఆర్‌ఎస్ పార్టీ పేరు లేనప్పటికీ అది ఆ పార్టీవాళ్ల పనేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!