Bangladesh Squad: బంగ్లాదేశ్ 2026 ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్‌కప్‌కు తమ జట్టును ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో బంగ్లాదేశ్ జట్టుకు అజిజుల్ హకీమ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, జవాద్ అబ్రార్ వైస్ కెప్టెన్‌గా ఉంటారని ESPNక్రిక్‌ఇన్ఫో తెలిపింది. గత రెండేళ్లుగా నిలకడగా రాణించిన ఆటగాళ్లపైనే వరల్డ్‌కప్‌కు బంగ్లాదేశ్ మేనేజ్‌మెంట్ ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. 2024 వరల్డ్‌కప్ తర్వాత యూత్ వన్డేల్లో ప్రపంచంలోని ఇతర జట్ల కంటే బంగ్లాదేశ్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది. 2025 ఏడాదిలోనే బంగ్లాదేశ్ 28 యూత్ వన్డే మ్యాచ్‌లు ఆడి, వాటిలో 17 విజయాలు సాధించింది.
2026 అండర్-19 వరల్డ్‌కప్‌కు బంగ్లాదేశ్ జట్టు : అజిజుల్ హకీమ్ (కెప్టెన్), జవాద్ అబ్రార్, సమియున్ బాసిర్, షేక్ పేవెజ్, రిజాన్ హొస్సాన్, షహరియా అల్ అమిన్, షాదిన్ ఇస్లాం, ఎం.డి. అబ్దుల్లా, ఫరీద్ హసన్, కలామ్ సిద్ధికి, రిఫాత్ బేగ్, సాద్ ఇస్లాం, అల్ ఫహద్, షహ్రియర్ అహ్మద్, ఇక్బాల్ హొస్సైన్.
READ MORE: Karimnagar: సబ్ రిజిస్టర్కు బెదిరింపులు.. డబ్బులు చల్లి ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని వార్నింగ్!
అజిజుల్ హకీమ్, జవాద్ అబ్రార్ ఈ జట్టులో ప్రత్యేకంగా నిలిచే జోడీగా కనిపిస్తున్నారు. 2024 వరల్డ్‌కప్ తర్వాత 1000 పరుగులకుపైగా సాధించిన ఏకైక బ్యాటర్లు వీరిద్దరే. 2025లో అజిజుల్ హకీమ్ 879 పరుగులు చేసి, ఒక సెంచరీతో పాటు ఐదు అర్ధశతకాలు సాధించాడు. జవాద్ అబ్రార్ 2025లో 977 పరుగులు చేసి, రెండు సెంచరీలు, ఆరు అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ రిజాన్ హొస్సాన్ కూడా 2025లో బ్యాటింగ్‌లో మెరిశాడు. అతను ఆ ఏడాది 830 పరుగులు చేసి, ఏడు అర్ధశతకాలు, ఒక సెంచరీ నమోదు చేశాడు.
READ MORE: Saudi-UAE War: పశ్చిమాసియాలో మరో ఉద్రిక్తత.. రెండు గల్ఫ్ దేశాల మధ్య తీవ్ర పోరు
బౌలింగ్ విభాగంలోనూ బంగ్లాదేశ్ జట్టు బలంగా కనిపిస్తోంది. 2025లో అత్యధిక వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లు ఈ జట్టులోనే ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ ఇక్బాల్ హొస్సైన్ 2025లో 34 వికెట్లు తీయగా, అల్ ఫహద్ 33 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సమియున్ బాసిర్ 29 వికెట్లు సాధించాడు. డిసెంబరులో జరిగిన అండర్-19 ఆసియా కప్‌కు దూరమైన అల్ ఫహద్ ఈసారి తిరిగి జట్టులోకి వచ్చాడు. అతని స్థానంలో ఎం.డి. సోబుజ్ జట్టుకు దూరమయ్యాడు. ఇదే గత ఆసియా కప్ జట్టుతో పోలిస్తే చేసిన ఏకైక మార్పు. గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌కు కఠినమైన సవాల్ ఎదురుకానుంది. గ్రూప్ బీలో భారత్, న్యూజిలాండ్, అమెరికా జట్లు ఉన్నాయి. మొత్తం నాలుగు గ్రూపులలో ప్రతీ గ్రూప్ నుంచి మూడు జట్లు సూపర్ సిక్సెస్‌కు చేరతాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. బలమైన జట్ల మధ్య పోటీ ఉండటంతో బంగ్లాదేశ్ తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సి ఉంటుంది.