మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం మరోసారి తెరపైకి వచ్చింది.. గత కొంతకాలంగా విశ్వేశ్వర్‌రెడ్డి చేరికపై వార్తలు వస్తూనే ఉన్నాయి.. అధిష్టానం నుంచి పెద్ద లీడర్లు ఎవరు రాష్ట్రానికి వచ్చినా.. ఆయన సమక్షంలో కొండా బీజేపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. ఈ మధ్య పాదయాత్రలో ఉన్న బండి సంజయ్‌ని కలిశారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో.. ఆయన బీజేపీలో చేరడం…
ఆ జిల్లాలో సగంమంది ఎమ్మెల్యేలను సర్వే టెన్షన్ పెడుతోందా? పార్టీ చేపట్టిన వడపోత.. ఉక్కపోతగా మారి ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఎవరు? సిట్టింగ్‌లు ఆందోళన చెందుతుంటే.. ఆశావహులు హుషారుగా ఉన్నారా? ఇంతకీ ఏంటా జిల్లా? లెట్స్ వాచ్..! మేము సిట్టింగులం.. అధినేతకు అనుకూలంగా ఉన్నాం.. మాకెలాంటి ఢోకా లేదని ఇన్నాళ్లూ కాలం వెళ్లదీసిన MLAలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొదవ లేదు. అలాంటి వారంతా ప్రస్తుతం సర్వే మాట చెప్పగానే ఉలిక్కి పడుతున్నారట. ఒక్కసారిగా మారిన రాజకీయంతో…
కాంగ్రెస్‌కు తాము దూరంగా ఉన్నామని చెప్పడానికి TRS నానా తంటాలు పడుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకి మద్దతు ఇచ్చిన TRS… అదే కూటమిలో ఉన్న కాంగ్రెస్‌కి తాను దూరమని ఒకటికి పదిసార్లు చెబుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ దగ్గరనే భావన రాబోయే ఎన్నికల్లో చేటు చేస్తుందని గులాబీ నేతల అంచనా. లోలోపల ఎలాంటి సంబంధాలున్నా.. పైకి మాత్రం బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమకు ఒకటే అనే వాదన వినిపిస్తోంది టీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల…
దాదాపు తొమ్మిది నెలల తర్వాత ముఖ్యమంత్రి కేసియార్ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు. కీలక సందర్భాల్లోనూ అటు వైపు చూడకపోవడంతో దూరం మరింత పెరిగింది. కేబినెట్ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని చాలాకాలంపాటు పెండింగ్‌లో ఉంచడంతో ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలవలేదు. గవర్నర్ వెళ్లిన సమ్మక్క సారక్క జాతరలోనూ.. భద్రాచలం పర్యటనలోనూ ప్రొటోకాల్ కనపడలేదు. మంత్రులు…అధికారులు గవర్నర్ వచ్చే సమయానికి మాయం అయ్యారు. తమకు సమాచారం ఇవ్వకుండా వస్తున్నారని చెప్పుకొన్నారు. మరో అభ్యర్థిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో పంపిన తర్వాత ప్రభుత్వం గవర్నర్…
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా వెళ్లనున్నారు.. ఆటా మహాసభలు - యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా ఎమ్మెల్సీ కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2వ తేదీన ఆటా మహాసభల్లో పాల్గొననున్న కవిత.. ఆ రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హ్యాచరీస్ కోసం భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే కాగా.. గత కొంత కాలంగా సర్వే నిర్వహించిన అధికారులు.. ఆక్రమణకు గురైన భూములను గుర్తించారు.. ఇవాళ మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేటకు చేరుకున్న మెదక్, తూప్రాన్, నర్సపూర్ ఆర్డీవోలు.. భూమి పంచనామా నిర్వహించారు.. మొత్తంగా అచ్చంపేటలో 77, 78, 79, 80, 81, 82, 130 సర్వే నెంబర్లలో మొత్తం 84 ఎకరాల భూమి, హాకింపేట సర్వే…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలిసారి అధునాతన సింథటిక్ క్యాడవర్‌తో కూడిన స్కిల్ ల్యాబ్, బర్తింగ్ సిమ్యులేటర్ ఏర్పాటు చేయగా.. గవర్నర్ తమిళిసై మంగళవారం నాడు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నేను మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే వివాహం చేసుకున్నా.. మీరు కూడా వయసులో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకోండి, చదువు అయిపోయేంత వరకు ఆగొద్దు’ అంటూ విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. Read Also:…
మెట్రో పిల్లర్లు కూడా టీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారు.. అధికారం ఉందని, డబ్బు ఉందని మీరు చేస్తున్న ప్రతి దానిని ప్రజలు గమనిస్తున్నారు.. వాళ్లు చీప్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు బీజేపీ నేత లక్ష్మణ్
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.. ఐదువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో ఉన్నంతసేపు మూడంచెల భద్రత కొనసాగించనున్నారు.