తెలంగాణ అమ్మాయి సుచరిత మన్యాల కొత్త చరిత్ర సృష్టించింది. మహబూబ్ నగర్ నుంచి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) వరకు ప్రస్థానం కొనసాగించింది. కేంబ్రిడ్జ్(అమెరికా)లోని ఆ సంస్థలో సీటు సంపాదించటమే గొప్ప అనుకుంటే అందులోనూ ‘సిస్టమ్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్’ కోర్సును ఇటీవలే సక్సెస్ఫుల్గా పూర్తిచేయటం విశేషం. ఈ రెండింటినీ సాధించటం ద్వారా ఆమె లింగ వివక్షను విజయవంతంగా అధిగమించారు. మహిళా సాధికారతకు వారధిగానూ నిలిచారు. Read Also: KCR: శ్రీలంక విషయంలో మాట్లాడకపోతే.. దోషిగా…
తెలంగాణ వచ్చి ఇప్పటికి 8 ఏళ్లయింది. 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. అయితే అంతకన్నా ముందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేదా అని ప్రశ్న ఇవాళ తలెత్తుతోంది. దీనికి కారణం ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. దీనికీ దానికీ సంబంధం ఏంటి అనుకుంటున్నారా?. అదే మనం ఇప్పుడు చర్చించుకోబోయే అంశం. 18 ఏళ్ల కిందట కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరిగాయి. అప్పుడేమో…
ఎన్టీపీసీ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలోనే అతిపెద్దదైన తేలియాడే సోలార్ ప్లాంట్ ను నిర్మించింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. పివీ ప్రాజెక్ట్ లో భాగంగా చివరిదైన 20 మెగావాట్లను ఉత్పత్తి ప్రారంభం అయింది. దీంతో మొత్తం 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పరిచేస్తోంది. ఈ ఘనత సాధించినందుకు రామగుండం టీమ్ ను ఎన్టీపీసీ…