BJP National Executive Meeting: ఎన్టీఆర్ రియల్ హీరో, ఆయన దేవుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుపై ప్రశంసల వర్షం కురిపించారు బీజేపీ సీనియర్ నేత, త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌దేవ్… జాతీయ కార్యకవర్గ సమావేశాల నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన ఆయన.. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అధ్యక్షతన జరిగిన ఆదిలాబాద్ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పాల్గొని.. ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలని సూచించారు.. ఎనిమిదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.. ఇక, ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.. టీడీపీని స్థాపించిన అనతి కాలంలోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి తెచ్చి చరిత్ర సృస్టించారని పేర్కొన్న ఆయన.. ఎన్టీఆర్ అసలైన హీరో, ఆయన దేవుడంటూ వ్యాఖ్యానించారు బిప్లవ్‌దేవ్.. అప్పటి వరకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేని స్థాయి నుంచి ప్రజాబలంతో ఒక్కసారిగా ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి చరిత్ర సృష్టించారని తెలిపారు.
Read Also: Puri Rath Yatra 2022: నేటి నుంచి పూరీ జగన్నాథ్ రథయాత్ర
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
మరోవైపు, తమ రాష్రంటోని రాజకీయాలపై స్పందించారు త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ దేవ్.. త్రిపురలో కూడా కమ్యూనిస్టుల కంచు కోటను బద్దలుకొట్టి భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించిందన్న ఆయన.. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, హైదరాబాద్ వేదికగా జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన నేతలు.. ఇప్పటికే జిల్లాల్లో అడుగుపెట్టారు.. తెలంగాణను చుట్టేస్తున్నారు.. ఏ జిల్లాను వదలకుండా పర్యటిస్తున్నారు.. వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. నియోజకవర్గ నాయకులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు, మోర్చాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు.. పదాధికారులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పుర ప్రముఖులు, వ్యాపారులతో భేటీ అవుతూ.. పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపే పనిలో పడిపోయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!