US-Venezuela War: వెనిజులాపై దాడి, అధ్యక్షుడి నిర్భందానికి కారణం ఇదేనా?.. యూఎస్ దాడుల వెనుక షాకింగ్ నిజాలు..
- వెనిజులాపై యూఎస్ దాడులు ఎందుకు..?
- దాడుల వెనక షాకింగ్ నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Venezuela War: అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ రోజు తెల్లవారుజామున అమెరికా, వెనిజులాపై విరుచుకుపడింది. ముఖ్యంగా రాజధాని కారకస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఏం జరిగిందో తెలిసేలోగా, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను నిర్బంధించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచం షాక్ అయింది. వెనిజులాపై భారీగా దాడులు చేసినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మదురోను వెనిజులా నుంచి అమెరికా పట్టుకెళ్లినట్లు చెప్పారు.
గత కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. మదురో ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధమని చెబుతోంది. తాజాగా, ఆ దేశ అధ్యక్షుడినే అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మాదకద్రవ్యాలు, వలసలు, జాతీయ భద్రత పేరు చెబుతూ అమెరికా ఈ ఈ దాడులకు పాల్పడింది.
Also Read
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
వెనిజులాపై అమెరికా ఎందుకు దాడి చేసింది?
వెనిజులా నుంచి డ్రగ్స్ భారీ ఎత్తున అమెరికాలోకి వస్తున్నాయని ట్రంప్ ప్రధాన ఆరోపణ. మరోవైపు, ఆ దేశం నుంచి యూఎస్‌లోకి వలసలు కూడా పెరిగాయి. అమెరికా దక్షిణ సరిహద్దును దాటుతున్న వారిలో వెనిజులా నుంచి వచ్చే వారే అధికంగా ఉంటున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. నివేదికల ప్రకారం, 2013 నుండి, దాదాపు ఎనిమిది మిలియన్ల మంది వెనిజులా ప్రజలు ఆర్థిక పతనం, రాజకీయ అణచివేత నుండి పారిపోయారని అంచనా. వీరిలో ఎక్కువ మంది లాటిన్ అమెరికాలోని ఇతర ప్రాంతాలలో పునరావాసం పొందారు. మదురో కావాలనే తన జైళ్లలోని ఖైదీలను అమెరికా వెళ్లమని బలవంతం చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. అయితే, వెనిజులా మాత్రం ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది.
రెండో కారణం డ్రగ్స్. వెనిజులా కోకైన్‌కు ప్రధానంగా రవాణా మార్గం. USలో ఫెంటానిల్ సంక్షోభానికి దోహదపడుతుందని ట్రంప్ వాదించారు. వెనిజులా నేర సంస్థలైన ట్రెన్ డి అరగువా మరియు కార్టెల్ డి లాస్ సోలెస్ లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా (FTOలు) ప్రకటించారు. ఈ రెండవ సంస్థకు స్వయంగా మదురోనే నాయకత్వం వహిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.
కారకాస్‌పై దాడులు, మదురో అరెస్ట్:
ట్రంప్ చెబుతున్న దాని ప్రకారం.. వెనిజులాకు వ్యతిరేకంగా అమెరికా చిన్న, తీవ్రమైన ఆపరేషన్ నిర్వహించింది. మదురోను ఆయన భార్యను బంధించి వెనిజులా నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ అరెస్ట్‌లో యూఎస్ అధికారులు పాల్గొన్నారని చెప్పారు. తమ దళాలు అద్భుతంగా పనిచేశాయని యూఎస్ ఆర్మీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మరోవైపు, తమ పౌరులపై, సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేసిందని వెనిజులా ఆరోపించింది.
గత కొన్ని నెలలుగా ఘర్షణ:
గత కొన్ని నెలలుగా అమెరికా, వెనిజులా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎప్పుడైనా యూఎస్ వెనిజులాపై విరుచుకుపడొచ్చని పలు నివేదికలు చెప్పాయి. విమాన వాహక నౌక USS జెరాల్డ్ R ఫోర్డ్‌తో సహా కరేబియన్‌లో పెద్ద US నావికాదళం, వైమానిక దళాలు మోహరించాయి. వెనిజులా చమురును దిగ్భంధించే చర్యల్లో భాగంగా యూఎస్ రెండు చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంది. మాదకద్రవ్యాల పడవలు ఉపయోగించే డాకింగ్ ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్లు ట్రంప్ గతంలో అన్నారు. ఇదే వెనిజులాపై అమెరికా చేసిన మొదటిదాడి. అయితే, డ్రగ్స్ కార్టెల్ నాయకులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని మదురో చెబుతున్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
ట్రెండింగ్
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!