MLA Adinarayana Reddy’s Son Sudheer Reddy Arrested: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడలో ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. సుధీర్ రెడ్డి పట్టుబడ్డాడు.
Also Read: India’s Squad: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!
నానక్‌రామ్‌గూడలో కొందరు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఈగల్ టీమ్, నార్సింగి పోలీసులు సమాచారం వచ్చింది. వెంటనే అప్రమత్తమై సంయుక్త ఆపరేషన్ నిర్వహించి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరికి డ్రగ్స్ పరీక్ష చేయగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సుధీర్ రెడ్డిని అరెస్టు చేసి.. డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన్ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.