MIT: తెలంగాణ అమ్మాయి సుచరిత.. కొత్త చరిత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అమ్మాయి సుచరిత మన్యాల కొత్త చరిత్ర సృష్టించింది. మహబూబ్ నగర్ నుంచి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) వరకు ప్రస్థానం కొనసాగించింది. కేంబ్రిడ్జ్(అమెరికా)లోని ఆ సంస్థలో సీటు సంపాదించటమే గొప్ప అనుకుంటే అందులోనూ ‘సిస్టమ్ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్’ కోర్సును ఇటీవలే సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేయటం విశేషం. ఈ రెండింటినీ సాధించటం ద్వారా ఆమె లింగ వివక్షను విజయవంతంగా అధిగమించారు. మహిళా సాధికారతకు వారధిగానూ నిలిచారు.
Read Also: KCR: శ్రీలంక విషయంలో మాట్లాడకపోతే.. దోషిగా పరిగణిస్తాం
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
‘సిస్టమ్ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్’ను సహజంగా మేల్ డామినేటెడ్ కోర్సుగా భావిస్తుంటారు. అంటే ఎక్కువగా అబ్బాయిలే దీన్ని ఎంచుకుంటారు. ఈ కోర్సును పూర్తిచేయాలంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టాన్ని సుచరిత ఇష్టంగా మలచుకుంది. కోర్సులో చేరకముందు ఆమె మొఫిట్ అనే ఎన్జీవోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేసేది. మొఫిట్.. అమెరికాలోని ఒక క్యాన్సర్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. అందులో సుచరిత క్యాన్సర్ రీసెర్చర్లు, ప్రొఫెషనల్స్, పేషెంట్స్ కోసం క్రిటికల్ హెల్త్‌కేర్ సిస్టమ్స్ డిజైనింగ్, డెవలప్‌మెంట్ పనులు చూసుకునేది.
ఈ స్కిల్స్‌కి మరింత పదును పెట్టుకునేందుకు, హెల్త్ కేర్ రంగంలో సొంత టెక్నాలజీ కంపెనీ పెట్టేందుకు మిట్‌లో చేరింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులకు ఎక్స్‌లెంట్ ఇన్‌స్టిట్యూట్ మిట్ కావటంతో ఫస్ట్ ఛాయిస్‌ని ఆ సంస్థకే ఇచ్చింది. కోర్సు పూర్తి చేయటానికి 16 నెలల లాంగ్ జర్నీ చేసింది. ఈ సుదీర్ఘ సమయం తనకు జీవితకాల అనుభవాన్ని మిగిల్చిందని సుచరిత పేర్కొంది. ‘సిస్టమ్ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సును ముఖ్యంగా ఇంజనీరింగ్ లీడర్లను తయారుచేసే లక్ష్యంతో రూపొందించారు. క్లిష్టమైన సవాళ్లను ఈజీగా, కొత్తగా పరిష్కరించగలిగేలా ఈ కోర్సు ఇంజనీరింగ్ లీడర్లను తీర్చిదిద్దుతుంది.
ప్రపంచంలోనే ది బెస్ట్ అనబడే ఇంజనీర్లలో కొంత మంది మాత్రమే ఈ కోర్సుకి అప్లై చేస్తారు. అడ్మిషన్ పొందటం ఒక ఛాలెంజ్ లాంటిది. సీటొచ్చిన విద్యార్థి కోర్సు పూర్తయ్యాక ప్రపంచానికి తన వంతు సర్వీసు అందించేలా మిట్ ఎంతో ఆశించి ప్రవేశం కల్పిస్తుంది. నా అనుభవం, మిట్ లక్ష్యం ఒకటే కావటంతో నేను సీటు సంపాదించా. అయితే అసలు సవాల్ సీటొచ్చాకే ఎదురైంది. ఒక వైపు కోర్సు, మరో వైపు వర్క్, ఇంకో వైపు ఫ్యామిలీ. ఈ మూడింటిని కోఆర్డినేట్ చేసుకోవటం కొంచెం ఇబ్బంది అయింది.
మిట్ ప్రొఫెసర్లు ప్రతి సెమిస్టర్‌లో, చివరి నిమిషం వరకు నా నుంచి అత్యుత్తమ ఔట్‌పుట్ రాబట్టారు. ఈ విషయంలో నా భర్త శశాంక్ పాండెం ఎంతో సహకరించారు. నేను లేకపోవటాన్ని మా అబ్బాయి అంత త్వరగా అడ్జస్ట్ చేసుకోలేకపోయాడు. నేను నా కొడుకుని ఎంతో మిస్సయ్యాను. చివరికి అర్థంచేసుకున్నాడు. స్కూల్లోని తన ఫ్రెండ్స్ అందరికీ మిట్ గురించి చెప్పేవాడు. మొత్తానికి నా కోర్సు పూర్తయింది. కానీ ఇప్పటికీ ఇంజనీరింగ్ అనేది పురుషాధిక్య రంగమేనని గట్టిగా చెప్పగలను. ఈ ఫీల్డ్‌లో లేడీస్ లీడర్ లెవల్‌కి చేరటం ఇంకా కష్టసాధ్యం.
టెక్నాలజీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను మిట్ గుర్తిస్తోంది. ప్రశంసిస్తోంది. కానీ బయటి ప్రపంచమే ఇంకా ఆ పనిచేయలేకపోతోందనిపిస్తోంది. టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగంలో మహిళలు తమనుతాము నిరూపించుకోవటానికి, నాయకత్వ స్థాయికి చేరుకోవటానికి పురుషుల కన్నా ఎక్కువ శ్రమించాలి. ఈ దిశలో వివిధ సంస్థల్లోని మహిళా ఇంజనీర్లను గుర్తించి, తగిన శిక్షణ ఇప్పించటం ప్రధానం’ అని సుచరిత మన్యాల అన్నారు
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!