Home
Telangana
Telangana News
-
42.43 లక్షల మంది రైతులకు లబ్ధి.. ఖాతాల్లో రూ.1153.50 కోట్లు జమ
కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు అండగా ఉంటూ రైతు బంధు పథకం కింద పంట సాయాన్ని అందిస్తోంది.. ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తోంది సర్కార్.. ఇప్పటి వరకు 42.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదును జమ చేశామని.. మూడు రోజుల్లో రైతుబంధు కింద రూ. 1153.50 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు అధికారులు.. ఇక, నాలుగో రోజులో భాగంగా రేపు… -
తెలంగాణ కరోనా అప్డేట్.. 24 గంటల్లో
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూనే ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1492 కరోనా కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 609417 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1933 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 586362 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 3534 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 19521 యాక్టివ్ కేసులు… -
సిఎం కెసిఆర్ పై ఈటల షాకింగ్ కామెంట్స్..
ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన పార్టీకి, ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటలపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వీటికి ధీటుగా ఈటెల రాజేందర్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈటల రాజేందర్ మరోసారి సిఎం కెసిఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాచరికాన్ని బొంద పెట్టడం కోసం హుజురాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారని.. చైతన్య వంతమైన నియోజకవర్గ హుజురాబాద్ అని పేర్కొన్నారు. ఆరు సార్లు ఎన్నికలు వస్తే అన్ని సార్లు… -
100 శాతం వరకు స్కాలర్ షిప్స్ తో కూడిన విభిన్నమరియు భవిష్యత్ ప్రయోజనం కలిగిన కోర్సులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు, తెలంగాణ శాసన మండలి ద్వారా 2020 సంవత్సరంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో స్థాపించబడింది. 200 ఎకరాలలో విస్తరించిన విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ విశ్వ విద్యాలయం పారిశ్రామిక ప్రయోజనకరమైన ప్రత్యేకమైన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉన్నతమైన నాణ్యత కలిగిన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. నిరంతరం సరికొత్త విధానాలను అన్వేషిస్తూ, వాటిని అనుసరిస్తూ, నిరంతరాయంగా నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది.… -
మరో మూడు రోజులు వర్షాలు..
తెలంగాణలో రానున్న మరో మూడు రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.. రేపు,ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.. ఇక, రాగల మూడు రోజుల పాటు.. ఇవాళ, రేపు, ఎల్లుండి.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడుతుందని.. ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక, రాష్ట్రంలో నైరుతి… -
హైదరాబాద్‌లో విచిత్ర పరిస్థితి.. సిరంజీ తీసుకెళ్తేనే వ్యాక్సిన్..!
వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి మొదట్లో భయపడిన ప్రజలు.. తర్వాత క్రమంగా వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర క్యూ కడుతున్నారు.. ఇప్పటికీ కొన్ని అపోహలు ఉనప్పట్టికీ మెజార్టీ ప్రజలు వ్యాక్సిన్ కోసం పోటీపడే పరిస్థితి.. మరోవైపు.. ఇంకా, వ్యాక్సిన్ల కొరత వేధిస్తూనే ఉంది.. అయితే, హైదరాబాద్‌లోని చంపాపేట గాంధీ బొమ్మ చౌరస్తా వద్ద కమ్యూనిటీ హల్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.. వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ ఉన్నా.. సిరంజీలకు మాత్రం కొరత ఏర్పడింది.. దీంతో.. బయట… -
టీఆర్ఎస్లోని ఈటల సన్నిహితుల దశ దిశ ఏంటి…?
ఈటల ఎపిసోడ్ తర్వాత టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? మాజీ మంత్రికి సన్నిహితులైన ప్రజాప్రతినిధులవైపు అందరి చూపు పడిందా? ప్రస్తుత పరిణామాలపై మౌనంగా ఉండేందుకే సన్నిహితులు మొగ్గుచూపుతున్నారా? మరికొద్ది రోజులు అలా ఉండటమే బెటర్ అని అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరా నాయకులు? టీఆర్ఎస్లోని ఈటల సన్నిహితుల దశ దిశ ఏంటి? తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత అనుచరులతో డిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు. గులాబీ… -
బిర్యానీ బాగాలేదన్నారని… రెస్టారెంట్ యాజమాన్యం దాడి…
హైదరాబాద్‌లో బిర్యానీ ఎంత ఫేమస్సో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది. ఏ రెస్టారెంట్లో చూసుకున్నా బిర్యాని రుచి అద్భుతంగా ఉంటుంది. లాక్డౌన్ సమయంలో కూడా బిర్యానీకే హైదరాబాదీలు మక్కువ చూపారు. ఇక ఇదిలా ఉంటే, మైలార్దేవులపల్లి మెఫిల్ రెస్టారెంట్లో బిర్యానీ బాగాలేదని ప్రశ్నించిన ఇద్దరు యువకులను యాజమాన్యం చితకబాదింది. Read: సుప్రీంకోర్టుకు మార్కుల ప్రణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫలితాలు… దీంతో మైఫిల్ రెస్టారెంట్‌పై కేసులు నమోదు… -
ఈ నెల 20 తరువాత రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేస్తారా? సడలింపులు పెంచుతారా?
ఈనెల 19 వ తేదీతో రాష్ట్రంలో లాక్డౌన్ సమయం ముగియనున్నది. జూన్ 9 నుంచి పది రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు ఇచ్చారు. అయితే, జూన్ 20 నుంచి లాక్డౌన్ ను పొడిగిస్తారా లేదంటే పూర్తిగా ఎత్తివేస్తారా అనే దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రుల నుంచి, ఆరోగ్యశాఖ నుంచి ముఖ్యమంత్రి ఇప్పటికే ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కరోనా… -
స్ధానిక సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు, రాత్రి గ్రామాల్లో బస..!
సీఎం కేసీఆర్ విజన్ మేరకు అధికారులు పనిచేయాలని స్ధానిక సంస్ధల్లో ఆకస్మీక తనిఖీలు నిర్వహించాలని, గ్రామాలలో రాత్రి బస చేసి పారిశుధ్ధ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్ధానిక సంస్ధలు), డిఎఫ్ఓలు, డిపిఓ లు, డిఆర్ డిఓ లు, మున్సిపల్ కమీషనర్లు ఇతర అధికారులతో స్ధానిక సంస్ధల నిర్వహణ పనితీరులో మెరుగుదల, తెలంగాణకు హరితహారం, ధరణి, వ్యాక్సినేషన్ లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!