త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్ కాగా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు బీసీసీఐ అవకాశం ఇచ్చింది.
న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ ఎంపికైనా.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తేనే అతడు తుది జట్టులో ఉండి మ్యాచ్‌లు ఆడతాడు. జనవరి 11న వడోదర, 14న రాజ్‌కోట్, 18న ఇండోర్ వేదికగా వన్డే మ్యాచులు జరగనున్నాయి. ఇక టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన జట్టే.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడనున్న విషయం తెలిసిందే. విజయ్ హరారే ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ సత్తాచాటిన విషయం తెలిసిందే.
భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.