Floating Solar Plant: ఎన్టీపీసీ రికార్డ్.. దేశంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీపీసీ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలోనే అతిపెద్దదైన తేలియాడే సోలార్ ప్లాంట్ ను నిర్మించింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. పివీ ప్రాజెక్ట్ లో భాగంగా చివరిదైన 20 మెగావాట్లను ఉత్పత్తి ప్రారంభం అయింది. దీంతో మొత్తం 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పరిచేస్తోంది. ఈ ఘనత సాధించినందుకు రామగుండం టీమ్ ను ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(సౌత్) అభినందించారు. పునరుత్పత్తి ఇంధన సామర్థంలో ఎన్టీపీసీ తన నిబద్ధతను చాటుకుందని ఆయన అన్నారు.
రామగుండం ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభించడంతో దక్షిణ భారతదేశంలో ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యం 217 మెగావాట్లకు పెరిగింది. రామగుండం కన్నా ముందు కేరళలోని కాయంకుళం వద్ద 92 మెగావాట్లు, ఏపీలో సింహాద్రిలో 25 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టులను ఎన్టీపీసీ ప్రారంభించింది.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
రూ. 423 కోట్ల వ్యయంతో 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న రిజర్వాయర్ లో ఈ ప్లాంట్ ను నిర్మించారు. 40 బ్లాకులుగా విభజించిన ఫ్లాంట్ లో ఒక్కో బ్లాక్ 2.5 మెగావాట్ విద్యుత్ ను జనరేట్ చేస్తుంది. ప్రతీ బ్లాక్ ఫ్లోటింగ్ ప్లాట్ ఫారమ్ లో 11,200 సోలార్ మాడ్యుల్స్ ఉంటాయి. దీంతో పాటు ఒక ఇన్వర్టర్, ట్రాన్స్‌ఫార్మర్, ఒక హెచ్ టీ బ్రేకర్ ఉంటుంది. సోలార్ మాడ్యుల్స్, హైడెన్సిటీ పాలిథిలిన్(హెచ్ డీ పీ ఈ)తో తయారు చేసిన తేలియాడే ఫ్లోటర్ పై ఉంచుతారు. ఇవి కదలకుండా లంగరు వేసి ఉంచుతారు. అండర్ గ్రౌండ్ 33 కేవీ కేబుల్స్ ద్వారా స్విచ్ యార్డ్ కు విద్యుత్ తరలిస్తారు. సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్స్, ట్రాన్స్‌ఫార్మర్లు మొత్తం ఫ్లోటింగ్ ఫ్లాట్ ఫారమ్ మీద ఉంచడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత
ఇటు విద్యుత్ ఉత్పత్తితో పాటు, పర్యావరణం, నీటి వనరులకు సహయపడనుంది ఈ సోలార్ పవర్ ప్లాంట్. నీటిపై ఏర్పాటు చేయడం వల్ల నీటి భాష్పీభవన రేటు తగ్గుతుంది. దీంతే ఏడాది కాలంలో 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి ఆవిరిని నివారించి నీటి సంరక్షణకు తోడ్పతుంది. ఇదే విధంగా ఏడాదికి 1,65,000 టన్నుల బొగ్గు వినియోగాన్ని తగ్గించడంతో పాటు 2,10,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించే వీలుంది.
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..