తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 26,976 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 516 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. రాష్ట్రంలో తాజాగా కరోనా కారణంగా మరణాలు ఏమీ నమోదు కాలేదు. కరోనా బారినపడి మొత్తం ఇప్పటివరకు 4,111 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 8,01,922 మంది కరోనా బారినపడగా…. 7,93,027 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 4,784 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రికవరీ రేటు 98.89 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.
అత్యధికంగా హైదరాబాద్‌లోనే 261 కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొన్నిరోజులుగా హైదరాబాద్ జిల్లాలో 250కి పైన రోజువారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇక, రంగారెడ్డి జిల్లాలో 43, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 43, మంచిర్యాల జిల్లాలో 34, సంగారెడ్డి జిల్లాలో 24 కేసులను గుర్తించారు. అదే సమయంలో 434 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్‌తో పాటు శానిటైజర్‌ను వాడాలని ప్రజలకు పదేపదే సూచిస్తున్నారు.
Monkeypox: యూరప్ లో కల్లోలం.. రెండు వారాల్లోనే మూడింతలైన కేసులు
కానీ కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కరోనా పుట్టినిల్లు చైనాలో సైతం కరోనా కేసులు భారీగా నమోదువుతుండడంతో కఠిన లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేశారు. దీంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే భారత్‌లో కూడా థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటు ఫోర్త్ వేవ్ వచ్చిన ఎదుర్కొనగలమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.