Boda Janardhan: చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్న నేత.. అయోమయంలో క్యాడర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీలు మారుతున్నా ఫలితం లేదు. ఎన్ని కండువాలు మార్చినా పదవి దక్కటం లేదు. అన్ని పార్టీలను ఓ రౌండ్ వేసిన ఆయన, చివరికి హస్తం గూటికి చేరారు. ఇక్కడైనా ఉంటారా? లేక మరో గూటికి చేరతారా? పూటకో పార్టీలో చేరితే, కేడర్ పరిస్థితేమిటనే చర్చ నడుస్తోంది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి మంత్రిగా పనిచేసిన బోడ జనార్థన్ మరోసారి పార్టీ మారారు. తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీలు మార్చడంలో ఆయన రికార్డు చెరిగిపోనిదనే టాక్ మొదలైంది.చెన్నూర్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోడ జనార్థన్ చంద్రబాబు హయంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. టిడిపి శాసన సభ్యుడిగా 1985లో గెలిచిన ఆయన ఆ తర్వాత మంత్రిగా, ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ గా, జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్ గా పనిచేశారు. అయితే టిడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆయన , ఆ తర్వాత బీజేపీలో చేరారు. అక్కడితో ఆగకుండా, మళ్లీ సొంతగూటికి చేరుకొని టిడిపి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు జనార్థన్. అన్ని చోట్లా తిరిగి వెనక్కి వచ్చిన జనార్థన్ టిడిపిలో కూడా ఉండిపోకుండా, కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read
Read Also: Narsapur Congress: అప్పట్లో ఆ నియోజకవర్గం హస్తానికి కంచుకోట.. ఇప్పుడు సీన్ రివర్స్
అక్కడితో ఆగకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ నుంచి పోటీ చేశారు. తిరిగి మళ్లీ బీజేపీలో చేరారు. బీజేపీలో ఆయనకు సముచిత స్థానం దక్కకపోవడంతో సైలెంట్ గా ఉండి, ఎప్పుడు గోడ దూకుతారా అనేలా చూసే పరిస్థితి వచ్చింది. చివరికి ఏడాది తర్వాత మళ్లీ హస్తం గూటికి చేరారు బోడ జనార్థన్. అయితే ఆయన చొక్కాలు మార్చినంతా ఈజీగా కండువాలు మార్చడం క్యాడర్ లో అయోమయం నెలకొంది.
తమ నేత అలవోకగా పార్టీలు మారుతుంటే ఆయన వెంట నడిచే క్యాడర్‌లో అయోమయం ఏర్పడుతోందనే టాక్ ఉంది. ఏ పార్టీలో ఉన్నా, ఎమ్మెల్యే పదవే కీలకం అనుకుంటున్న బోడ జనార్థన్ తీరు ఆయన సన్నిహితులకు సమస్యగా మారిందట.
అయితే చెన్నూర్ కాంగ్రెస్ లో ఇంతకంటే ముందే నల్లాల ఓదెలు దంపతులు చేరిపోగా ఇప్పుడు బోడ జనార్థన్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు సైతం వస్తున్నాయట.. పార్టీ మారినా ఫలితం ఉంటుందా…చెన్నూర్ నుంచి బరిలో ఉడండం సాద్యమేనా..లేదంటే పెద్దపల్లి పార్లమెంట్ నుంచి బరిలో నిలుస్తారా అనే చర్చ సైతం ఊపందుంకుంది.
ఇవన్నీ చూస్తూ బోడ జనార్థన్‌ది పార్టీలు మారడంలో చెరగని రికార్డ్ అనే టాక్ మొదలైంది. ఇన్ని పార్టీలు మారిన తర్వాతైనా ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారా? లేక మరో కండువా కప్పుకుంటారా అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!