బీజేపీ బహిరంగకు సుమారు 10లక్షల మందికి పైగా జనసమీకరణ, మరోవైపు దేశ ప్రధాని హాజరవనున్న సభ. అయితే బీజేపీ నేడు నిర్వహించదల్చిన భారీ బహిరంగ సభకు వాన టెన్షన్ పట్టుకుంది. కాగా. నిన్నటి నుంచి హైదరాబాద్ లో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భాజపా శ్రేణులు భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టారు.
అయితే సభలకు ముందువరకు సాధారణంగా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావడంతో గురువారం నుంచి రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లోను వర్షం పడుతోంది. ఇదిలా ఉండగా మరో రెండు, మూడ్రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు.. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ప్రకటించారు. ఈనేపథ్యంలో నేటి బీజేపీ సభకు వాన ఆటంకం కలుగుతుందేమోనని బీజేపీ శ్రేణులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర కేబినెట్.. ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం ఈసభకు హాజరవుతుండడంతో తెలంగాణ బీజేపీ నేతలు కూడా తమ బలాన్ని ప్రధానమంత్రి ముందు ఈ సభ ద్వారా ప్రదర్శించేందుకు ప్రయత్నం చేసిన, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సభపై ఆందోళన ఏర్పడింది.