Dead Body: దుబాయ్ నుంచి రాజక్కపేటకు డెడ్ బాడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లినవారు అక్కడ దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్క పేట గ్రామానికి చెందిన మధు అనే యువకుడు బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. 24 రోజుల క్రితం సౌదీ అరేబియాలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించారు.
స్పందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధు మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లి విగతజీవిగా మధు తిరిగి రావడం బాధాకరమన్నారు. మధు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భోరున విలపించారు. మధు మృతదేహం కోసం 24 రోజులుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని వారంతా వాపోయారు. బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లి మృతి చెందిన మధు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మధు మృతదేహానికి గ్రామస్తులు నివాళులు అర్పించారు. అధైర్య పడవద్దని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.మధుకు భార్య. కూతురు. కుమారుడు ఉన్నారు.
Also Read
Vijayawada Crime: డబ్బు తిరిగి ఇవ్వమన్న కారు వాష్ యజమానిపై దాడి
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..