BJP MLA Raghunandan Rao: ఎందుకిలా డల్‌గా ఉన్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో నిన్న, మొన్న రెండు రోజుల పాటు భారీఎత్తున జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా విజయవంతమయ్యాయి. దీంతో తెలంగాణలోని కమలదళంలో అడుగడుగునా ఆ సంతోషం, ఆనందం కనిపిస్తోంది. అయితే ఈ సమావేశాల్లో వేదిక పైన వెనక (రెండో) వరుసలోని సరిగ్గా మధ్యలో కూర్చున్న పార్టీ యువ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాత్రం డల్‌గా ఉండిపోయారు.
మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని భుజం తట్టి అభినందిస్తున్న సమయంలో వాళ్లిద్దరికి అటూ ఇటూ కూర్చున్న అమిత్‌షా, నడ్డా, తరుణ్ ఛుగ్, రాజ్‌నాథ్‌సింగ్ ఆసక్తికరంగా అటు చూస్తూ నవ్వుతూ కనిపించారు. అప్పుడు రఘునందన్‌రావు మొహంలో ఏ ఫీలింగూ లేదు. సాక్షాత్తూ ప్రధాని మోడీయే బండి సంజయ్‌ని మెచ్చుకుంటూ ఉంటే ఆ తాలూకు ఎక్స్‌ప్రెషన్ అక్కడున్న ప్రతిఒక్కరి ఫేస్‌లోనూ ప్రతిబింబిస్తోంది. కానీ ఈ ముఖ్యమైన సన్నివేశం తన కళ్ల ముందే జరుగుతున్నా దుబ్బాక ఎమ్మెల్యే మాత్రం అన్యమనస్కంగా, అదేమీ పట్టనట్లుగా విచార వదనంతో ఉన్నారు.
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
read also: Pawan Kalyan: ప్రధాని మోదీ పర్యటనకు పవన్ కళ్యాణ్ దూరం
పరేడ్ మైదానంలో జరిగిన విజయ సంకల్ప సభా వేదిక పైనా ఇవే దృశ్యాలు రిపీట్ అయ్యాయి. అక్కడ సైతం రఘునందన్‌రావు స్టేజీ మీద రెండో వరుసలో మధ్యలోనే ఆసీనులయ్యారు. అయితే అగ్రనేతలంతా నిల్చొని చేతులెత్తి సభికులకు అభివాదం చేస్తున్న సందర్భంలో కూడా ఆయన ముభావంగానే కళ్లు నేలకేసి చూస్తూ ఉన్నారు. మరోసారి.. ప్రధాని మోడీ అమిత్ షాతో మాట్లాడుతున్నప్పుడూ రఘునందన్‌రావు చేతులు కట్టుకొని అచేతనంగా అదో లోకంలో ఉన్నట్లు కనిపించారు.
ఈ మీటింగులకు సంబంధించి నిన్న టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలను, ఇవాళ పేపర్లలో వార్తలను, ఫొటోలను చూసినవాళ్లు బీజేపీ ఎమ్మెల్యే ఎందుకిలా డల్‌గా ఉన్నారనేదానిపై చర్చించుకుంటున్నారు. సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో అనూహ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్‌పై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన రఘునందన్‌రావు ఆ తర్వాత బీజేపీలో కీలక నేతగా వ్యవహరించారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని పలు అంశాల్లో నిలదీశారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన బీజేపీలో కంఫర్ట్‌గా లేడనే వార్తలు వస్తున్నాయి.
జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో బాధితురాలి ఫొటోలను రఘునందన్‌రావు బయటపెట్టడం ద్వారా పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తెచ్చారనే విమర్శలు వినిపించాయి. బాధితురాలి ఫొటోలను వెల్లడించకూడదనే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. అయితే దీనిపై రఘునందన్‌రావు చేస్తున్న పోరాటంలో పార్టీ మద్ధతు లభించట్లేదని అంటున్నారు. ఫలితంగా ఆయన ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. బండి సంజయ్‌కి, రఘునందన్‌రావుకి మధ్య పొసగట్లేదని టాక్.
read also: COVID 19: దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు.. పెరిగిన పాజిటివిటీ రేటు
అందుకే రఘునందన్‌రావు తిరిగి టీఆర్‌ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారమూ జరిగింది. ఎమ్మెల్యే అయిన కొత్తలో రఘునందన్‌రావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మీద కూడా అభ్యంతర వ్యాఖ్యలు చేసినట్లు వివాదం తలెత్తింది. దీంతో ఆయన వైఎస్ అభిమానులకు క్షమాపణ కూడా చెప్పారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికీ ఆయన గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్‌రావు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హ్యాపీగా పాల్గొనలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
- Tags
- bandisanjay
- bjp
- MLA
- modi
- raghunandan rao
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!