కేసీఆర్ కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లాకు అనేక హామీలు ఇచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు సమాధానం చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి.. మేమే పెడతామని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారు కదా.. మీరు పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదు.. మీ కుటుంబం కోసం మాత్రమే.. వరదల వల్ల నష్టపోయిన రైతులకు పది పైసలు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి అన్నారు.
భూముల అమ్మకానికి చంద్రబాబు నాయుడు కిటికీలు తెరిస్తే.. రాజశేఖర్ రెడ్డి దర్వాజాలు తెరిస్తే.. బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ను అమ్మేస్తున్నారు అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో కూడా భూములను ఉంచుతలేరు.. చివరికి స్మశానం కూడా అమ్మేసారని హైకోర్టు స్టే ఇచ్చింది.
Rains To Fall in AP and Telangana due to Low Pressure in Bay of Bengal: 5 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం (ఆగష్టు 18) నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు కురియగా.. ఆకాశం మొత్తం మేఘావృతం అయి…
రాగల మూడురోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్- సెక్రటేరియట్ సూచనలకు అనుగుణంగా, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి స్వీకరించడం) బిల్లు-2023తో సహా రాష్ట్ర శాసనసభ కార్యదర్శి నుంచి అందిన అన్ని బిల్లులు చట్ట కార్యదర్శికి సిఫార్సు చేయబడ్డాయి.
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది అని వస్తున్న అసత్య ప్రచారాల్ని ఎవరు నమ్మొద్దని ఇవాళ (గురువారం ) విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్లారిటి ఇచ్చారు. ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా ఈ ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని ఆయన పేర్కొన్నారు.