పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తిరగపడ్తామ్ తరిమి కొడతాం అనే కార్యక్రమంపై చర్చించామని ఆయన తెలిపారు. ఈనెల 21 నుంచి సెప్టెంబర్ 15 వరకు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సర్కార్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు. తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఏ విదంగా ఇబ్బంది పడ్డారు.. అమలు కానీ హామీలు, మోసాలు అన్ని ఛార్జ్ షీట్ రూపంలో జనంలోకి తీసుకెళతామని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Jagga Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన జగ్గారెడ్డి.. ఇది ఫైనల్..!
ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు గ్రామ గ్రామాన వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. అదే విదంగా కేంద్ర సర్కారుపై కూడా మరో ఛార్జ్ షీట్ విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. అదానీ, అంబానీల ఆస్తులు పెంచడానికి మోడీ చేసిన పనులు ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయనే దానిపై ప్రశ్నిస్తామని తెలిపారు. ఇక, ఈనెల 26 న చేవెళ్ల సభపై కూడా చర్చించాం.. చేవెళ్లలో ప్రజా గర్జన పేరుతో బహిరంగ సభ ఉంటది.. ఆ సభకు ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే వస్తున్నారు.. ఈ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Read Also: Gold Seized: లుంగీలో బంగారం.. కేటుగాడి గుట్టురట్టు చేసిన కస్టమ్స్ అధికారులు
ప్రజల్లో కేసీఆర్ సర్కార్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ కు 75 నుంచి 80 సీట్లు వస్తాయి.. బీసీ సమావేశం పొద్దున్న జరిగింది.. సీనియర్ నాయకులూ కూడా పాల్గొన్నారు.. వచ్చే ఎన్నికల్లో బీసీలకు సముచిత స్తానం కల్పించాలని కోరామని ఆయన వెల్లడించారు. బలమైన బీసీ నాయకులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాం.. స్క్రీనింగ్ కమిటీలో బీసీలకు చోటు కల్పించాలని చర్చించామని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.