*అయోధ్య: నేటి నుంచి సామాన్య భక్తులకు బాలరాముడి దర్శనం.. బాలరాముడి దర్శనానికి సమయం ఖరారు.. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు దర్శనం.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం.
*అనంతపురం: నేడు ఉరవకొండలో సీఎం జగన్ పర్యటన… వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.
*నేటి నుంచి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల జిల్లాల్లో పర్యటన.. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించనున్న షర్మిల.. శ్రీకాకుళం జిల్లా నుంచి షర్మిల పర్యటన ప్రారంభం.
*తిరుమల: నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల.. ఏప్రిల్ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనున్న టీటీడీ.. ఉ.11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల.. మ.3గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల.. రేపు ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.
*నేడు రాజమండ్రిలో ఆటోలు బంద్.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రభుత్వం ప్రవేశపెడుతున్నందుకు నిరసనగా బంద్.
*ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నేడు మంత్రి సీతక్క పర్యటన.. ఉట్నూర్‌లో ఇవ్వాళ ఉమ్మడి జిల్లా అధికారులతో జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క సమీక్ష.. జంగు బాయి దేవస్థానం వెళ్లనున్న మంత్రి.
*ఖమ్మం: నేడు ఖమ్మం కార్పొరేషన్‌లో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం
*పార్వతీపురం మన్యం జిల్లా: మక్కువ మండలంలో నేడు శంబర పొలమాంబ సినిమానోత్సవం.. భారీ ఏర్పాట్లు చేసిన దేవాదాయశాఖ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు.
*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,050.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57, 800.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,000