President Ethome: నెల్లుట్ల సర్పంచ్ దంపతులకు రాష్ట్రపతి ఎట్ హోంకు పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామ సర్పంచ్ దంపతులు చిట్ల స్వరూపారాణి భూపాల్ రెడ్డికి అద్భుతమైన అవకాశం వచ్చింది. నెల్లుట్ల గ్రామపంచాయతీ కీర్తి పతాకాన్ని ఢిల్లీ గడ్డపై రెపరెపలాడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను నీటి సమృద్ధి విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్న తొమ్మిది నెలల్లోనే తాజాగా రాష్ట్రపతి ఎట్ హోంకు హాజరయ్యే మరో అవకాశం వారికి దక్కింది. ఈనెల 26వ తేదీన గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ హోం వేడుకలకు రావాలంటూ నెల్లుట్ల సర్పంచ్ దంపతులకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర పంచాయితీరాజ్ విభాగం నుంచి తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ కు ఆదేశాలు పంపించారు.
Read Also: Ayodhya Ram Mandir : రాముడు వచ్చే వేళా విశేషం.. ఉత్తర ప్రదేశ్‌కు కాసుల వర్షం
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
దీంతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా జిల్లా పంచాయితీ అధికారికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, గత ఏడాది ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ స్వరూపారాణి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలోనే సర్పంచ్ స్వరూపారాణికి ఎట్ హోమ్‌కు రాష్ట్రపతి ఆఫీస్ నుంచి ఆహ్వానం అందింది. దేశ వ్యాప్తంగా కేవలం ఎనిమిది మంది సర్పంచ్‌లకే ఈ అవకాశం దక్కగా.. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి నెల్లుట్ల సర్పంచ్‌కు చోటు దక్కడం విశేషం.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!