టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన గాంధీ భవన్ లో సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపదాస్ మున్శితో పాటు ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీ ఖాన్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మేనిఫెస్టో కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: Komatireddy Venkat Reddy: నిరుద్యోగులను కేసీఆర్ ఇంటికి పంపాలా.. కేటీఆర్ ఇంటికి పంపాలా..?
ఈ సందర్భంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒక మంచి ఎన్నికల మేనిఫెస్టో అందించగలిగాము.. రాష్ట్రంలో అన్నింటికంటే మంచి మేనిఫెస్టో ఇవ్వగలిగాము అని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చాం.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. రెండో రోజు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీలో పది లక్షల ఆరోగ్య పథకాన్ని అందించాము.. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ఐటీ మినిస్టర్ చెప్పుకొచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పై ఎంతో విశ్వసాన్ని చూపారు.. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయి.. వారు చేస్తున్న విమర్శలను పట్టించుకుంటే పనులు జరగవని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది అని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.