Bhatti Vikramarka: మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో నిర్వహించిన వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. MSME ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించిన ఆయన వాటిని పరిశీలించారు.
Read Also: Thug Life: లెజెండ్స్ షూటింగ్ స్టార్ట్ చేసారు…
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి వ్యవసాయం నుంచి పారిశ్రామికీకరణ వైపు నడిపించడానికి గత ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రణాళికలు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయన్నారు. సువిశాలమైన భారతదేశంలో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికిని ఉత్పత్తి రంగాలన్నింటినీ పంచవర్ష ప్రణాళికలు గానీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు దేశ పురోగతిలో కీలక పాత్రను పోషిస్తున్నాయన్నారు. ప్రపంచీకరణ సరళీకరణ వచ్చిన తర్వాత దేశంలోకి వచ్చిన తర్వాత మల్టీ నేషనల్ కంపెనీలు మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ను మింగేశాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. వెల్త్ ఒకే చోట ఉండటం ప్రజాస్వామ్యానికి, సమాజానికి ప్రమాదకరం.. మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ను ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది.. ఉద్యోగ ఉపాధి కల్పన సమానత్వం సామాజిక న్యాయం వృద్ధిరేటు పెరగడానికి ఎంఎస్ఎంఈ తోడ్పాటు అవుతుంది అని భట్టి విక్రమార్క తెలిపారు.
Read Also: Chandrababu: చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం
భూతద్దంలో పెట్టి వెతికిన మల్టీ నేషనల్ కంపెనీల వల్ల సామాజిక న్యాయం సమానత్వం ఉద్యోగ ఉపాధి కల్పన కనిపించదు అని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. మల్టీ నేషనల్ కంపెనీలతోనే అభివృద్ధి సాధ్యం అన్నది గ్లోబల్స్ ప్రచారం మాత్రమే.. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ను పెంచుతాం ప్రభుత్వ పరంగా ప్రోత్సహకాలు ఇస్తాం.. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పెంచి యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా, మేధోపరంగా సహకారం అందిస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పన పెరుగుతుంది. దీని వల్ల దేశ వృద్ధిరేటు పెరగడానికి దోహదపడుతుంది అని ఆయన పేర్కొన్నారు. వనరులు సమానంగా పంచి, సంపద సృష్టించే రంగాల్లో అందరిని భాగస్వాములు చేయడం వల్లనే సమ సమాజ స్థాపన జరుగుతుంది.. సంపద సృష్టించే రంగాల్లో అందరిని భాగస్వామ్యం చేయకుంటే దేశంలో అసమానతలు పెరిగిపోవడం ఈ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ యువ పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ప్రోత్సాహకాలు అందిస్తుంది.. సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి రాయితీలు ప్రోత్సాహకాలు కావాలని కోరారు.. రాష్ట్రానికి సమాజానికి నష్టం లేనప్పుడు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగానే ఉంటుంది అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!