*హైదరాబాద్: నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం.. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్న ధరణి కమిటీ.. పెండింగ్ సమస్యలు, మధ్యంతర నివేదికపై చర్చ.
*నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన.. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం జగన్.
*నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ.. విజయవాడ ఏపీసీసీ కార్యాలయంలో కార్యక్రమం ప్రారంభం.. పోటీ చేసే అభ్యర్థుల దరఖాస్తులు అందజేయాలన్న షర్మిల
*నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పర్యటన.. ఉదయం విశాఖ జిల్లా ముఖ్య నాయకత్వంతో సమావేశం.. షర్మిళ సమక్షంలో పార్టీలో చేరనున్న ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ మాజీ ఛైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి.. మధ్యాహ్నం అనకాపల్లిలో కేడర్ మీటింగ్.. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం.. సాయంత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీకి సంఘీభావం ప్రకటించనున్న షర్మిల.
*తిరుమల: నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనానికి రూ.300 కోటా టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఏప్రిల్ ఏటా టికెట్లు విడుదల.. మధ్యాహ్నం 3గంటలకు తిరుమల, తిరుపతి గదుల కోటా టికెట్లు విడుదల.
*నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రుల పర్యటన.. సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న మంత్రి దామోదర రాజనర్సింహ.. సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఇంఛార్జి మంత్రి కొండా సురేఖ
*నేటి నుంచి ఈ నెల 28 వరకు స్పెయిన్‌లో మంత్రి జూపల్లి పర్యటన.. మాడ్రిడ్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ టూరిజం ట్రేడ్ ఫెయిర్‌లో జరగనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు.
*సంగారెడ్డి: నేటి నుంచి రెండ్రోజులపాటు మొగుడంపల్లి (మం) ఉప్పర్ పల్లిలో మరిగమ్మ మోతిమాత జాతర.. జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తుల రాక.
*యూపీ: రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. ఈ రోజు బాలరాముడి దర్శనానికి 3 లక్షల మంది వస్తారని అంచనా.. 8 వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు.
*నేడు దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పేపర్-2 పరీక్ష.. ఈ నెల 27, 29, 30, 31, ఫిబ్రవరి 1న జేఈఈ మెయిన్ పేపర్ పరీక్ష.
*నేడు మదురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభోత్సవం.. ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్న సీఎం స్టాలిన్.. స్టేడియంలో తొలిసారిగా జల్లికట్టు పోటీల నిర్వహణ.
*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,050.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,800.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500.