త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం.. తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించారు. వీటికి సొంత…
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. టెక్నాలజీ పరంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సమ్మిళితమయ్యే సామాజిక ప్రభావాన్ని సృష్టించడంపై దృష్టి సారించి, సమాజానికి ఉత్తమమైన వాటిని చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు కీసర బాల వికాస క్యాంపస్‌లో సోషల్ స్టార్టప్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరవింద్ ఐ కేర్ సిస్టమ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేష్…
అసెంబ్లీలో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని.. అది ఏ మాత్రం చిన్న సంఖ్య కాదన్నారు. అలాగే 25 మంది ఎమ్మెల్సీలు, 14 మంది ఎంపీలు బీఆర్ఎస్కు ఉన్నారని గుర్తుచేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ను ఎక్కువ.. తక్కువ చేస్తే మా తడాఖా ఏంటో చూపిస్తామని చెప్పుకొచ్చారు
తెలంగాణ ఉద్యమంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు లేకపోతే చిన్న రాష్ట్రాల స్వేచ్ఛ ఉండేది కాదని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.