* నేడు విశాఖకు సీఎం చంద్రబాబు.. కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన.. విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు..
* నేడు తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్..
* నేడు కర్నూలు జిల్లాలో అటల్– మోడీ సుపరిపాలన బస్సు యాత్ర.. ధర్నా చౌక్ లో అటల్ బిహారీ వాజపేయి విగ్రహ ఆవిష్కరణ.. పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రులు, సత్యకుమార్ యాదవ్, టీజీ భరత్, కూటమి ఎమ్మెల్యేలు.. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ..
* నేటి నుంచి నకిలీ మద్యం కేసులో నిందితులకు కస్టడీ.. నలుగురు నిందితులను విచారించనున్న పోలీసులు..
* నేటితో ముగియనున్న రెండో విడత ఎన్నికల ప్రచారం..
* నేడు ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ.. ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు. బెయిల్ పిటిషన్ తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు..
* నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పీఎస్ లో సెరెండర్ కావాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను టార్చర్ చేయొద్దని ఆదేశాలు.. వారం రోజుల పాటు పోలీస్ కస్టోడియల్ విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం..