తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని లేనిపక్షంలో కారుణ్య ఆత్మహత్యకు అయినా అనుమతించాలని కోరుతూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన నక్క సునీత అనే మహిళ ప్రజావాణిని ఆశ్రయించింది. ముగ్గురు మానసిక దివ్యాంగులైన పిల్లలతో ఉపాధి లేక పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లలు మానసిక దివ్యాంగులు కావడంతో తన భర్త ఉపాధి కొరకు గల్ఫ్ దేశానికి వలస వెళ్లినట్లు సునీత తెలిపింది.
సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ స్పెషల్ జీవో జారీ చేసింది. అలాగే తెల్లవారు జామున ఉదయం 1:00, 4:00 గంటలకు బెన్ఫిట్ షోస్ వేసేలా పర్మిషన్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇప్పడు తెలంగాణలో ఈ మూడు సినిమాలకు బెన్ఫిట్ షోస్, టికెట్ ధరలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే సందిగ్దత నెలకొంది. Also Read…
CM Revanth Reddy : హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కొత్త ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 42 పనులలో 36 పనులు పూర్తి అయ్యాయి. ఇందులో అత్యంత ప్రాముఖ్యమైన ఫ్లైఓవర్, జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించబడింది. ఇది సికింద్రాబాద్, వరంగల్, భువనగిరి, మేడ్చల్, హుజురాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల వాసులకు శంషాబాద్ విమానాశ్రయానికి సిగ్నల్-ఫ్రీ ట్రావెల్‌ను సౌకర్యవంతంగా అందిస్తుంది. PM Modi: 8న…
Guinness World Record: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పణికేరా తన అసాధారణ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించాడు. కేవలం ఒక నిమిషంలో తన నాలుకను ఉపయోగించి 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్స్ ఆపడం ద్వారా ఈ అరుదైన రికార్డును సాధించారు. అసాధారణమైన సాహసాలకు ప్రసిద్ధి చెందిన క్రాంతిని అభిమానులు ప్రేమగా “డ్రిల్ మాన్” అని పిలుస్తారు. ఈ సందర్బంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో…
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రైతు భరోసాపై సంచలన ప్రకటన చేశారు.
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం.. కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్ళీ వస్తాయని అన్నారు. ఏడాది అయినా కేసీఆర్ జపం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పే ముఖ్యమంత్రి.. పరిపాలన చేతకాకే మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.
మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో వీడియో రికార్డుల కలకలం రేపుతోంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూం వద్ద ఓ యువకుడు వీడియో రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిగే చర్యలు తీసుకోవాలని హాస్టల్ ముందు స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు.
Rum in Cake : గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామంలో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు బేకరీలలో జరిగిన తనిఖీల్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ ఖార్ఖాన ప్రాంతంలోని ఓ బేకరీలో, ఎక్సైజ్ అనుమతి లేకుండా ప్లమ్ కేక్‌ల తయారీలో ఆల్కహాల్ (రమ్) ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా, ఈ విషయం గురించి లేబుల్‌పై ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. కేకుల తయారీలో ఉపయోగించే…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... ప్రజావాణి పేరుతో ప్రజల సమస్యలపై దరఖాస్తులను స్వీకరించింది. పీసీసీ చీఫ్‌గా మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే అనవాయితీ కొనసాగింది. గాంధీభవన్‌లో వారానికి రెండు రోజులు మంత్రులు వచ్చి...ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని నిర్ణయించారు.