HYDRA : హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత పటిష్ఠ చర్యలకు దారితీసింది. ఈ క్రమంలో హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్ భవనంలోని B-బ్లాక్‌లో ఈ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. హైడ్రాకు విస్తృతమైన అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నగరంలోని…
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. నాగవంశీ నిర్మాతగా ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సహ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాని బాబీ డైరెక్ట్ చేయగా ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అలాగే ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రధాని మోడీతో కొట్లాడి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి మెట్రో రైలును తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఫ్లై ఓవర్‌కు దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టినట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఓల్డ్ సిటీ చాలా అందమైన నగరమని.. ఇక్కడ ఉండే ప్రజలంతా ప్రేమానురాగాలతో ఉంటారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అక్బరుద్దీన్ పాల్గొని ప్రసంగించారు.
భాగ్యనగరంలో మరో వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఆరాంఘర్- జూపార్కు ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.