Raghunandan Rao: కులగణన గురించి గొప్పగా చెప్పుకునే రాహుల్ గాంధీ తెలంగాణలో బీసీని సీఎం చేయండి
- కులగణనపై గొప్పగా చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం పదవి బీసీకి ఇవ్వాలి..
- తెలంగాణ మంత్రి వర్గంలో ఇప్పటి వరకు మైనార్టీ ఎందుకు లేరో చెప్పాలి..
- రాష్ట్రానికి ఏమీ రాలేదంటూ పత్రికల్లో రావడం బాధాకరం: రఘునందన్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao: లోక్ సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు.. కుల గణన గురించి గొప్పగా చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం పదవి బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, మిగిలిన ఆరు మంత్రి పదవులు కూడా బీసీలకే ఇవ్వాలన్నారు. సగం జనాభా ఉన్న బీసీలకు రెండే మంత్రి పదవులు ఇచ్చి జబ్బలు చాచుకుంటున్నారని సెటైర్లు వేశాడు. తెలంగాణ మంత్రివర్గంలో మైనారిటీ ఎందుకు లేరో చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఉదహరించారు ఎంపీ రఘునందన్ రావు
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్
Also Read
- Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Instagram Love: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
Read Also: ప్రాణాంతక క్యాన్సర్ ఎన్ని రకాలో తెలుసా..?
ఇక, ప్రధాని మోడీ మాటలు నిజం చేస్తాడు.. రాహుల్ మాటలు మాత్రమే చెప్తాడు అని రాఘునందన్ రావు తెలిపారు. మోడీ క్యాబినెట్ లో 27 మంది ఓబీసీ, 8 మంది దళిత, 8 మంది మహిళా మంత్రులు, ఐదుగురు మైనారిటీ మంత్రులు ఉన్నారని తేల్చి చెప్పారు. అలాగే, తెలంగాణ రాష్ట్రానికి ఏమీ రాలేదంటూ పత్రికల్లో రావడం బాధాకరం.. ఒక్క ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకే రూ. 20 వేల కోట్లకు పైగా ఇచ్చింది మోడీ సర్కారు అని ఆయన వెల్లడించారు. రైతులకు, ఉపాధి హామీ లాంటి పథకాలకు బడ్జెట్ పెంచిన ఘనత మోడీ ప్రభుత్వానిదే.. మధ్య తరగతి ప్రజల గోడు విన్నది కేవలం నరేంద్ర మోడీని అని మెదక్ ఎంపీ రాఘునందన్ రావు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!