PM Letter: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రధాని నరేంద్ర మోడీ లేఖ
- కేసీఆర్‌కి ప్రధాని నరేంద్ర మోడీ లేఖ
- కేసీఆర్ అక్క చీటి సకులమ్మ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం.
- చీటి సకలమ్మ అకాల మృతి పట్ల తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తూ లేఖ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Letter: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్క చీటి సకులమ్మ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కి సంతాప సందేశాన్ని పంపారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో వున్న కేసీఆర్ కి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ లేఖను రాసారు. ఈ లేఖలో ప్రధాని నరేంద్ర మోడీ.. శ్రీమతి చీటి సకలమ్మ గారి మరణవార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. ఈ అనుకోని ఘటన ఎంతో బాధకు గురిచేసిందని, కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మిగిలిపోతుందని అన్నారు.
Also Read: iQOO Neo 10R:పవర్ ఫుల్ ఫీచర్స్ తో.. ఐకూ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
శ్రీమతి చీటి సకలమ్మ అనురాగశీలి, మానవీయ దయా గుణాలు కలిగిన గొప్ప వ్యక్తి అని మోడీ అన్నారు. కుటుంబాన్ని ప్రేమగా, శ్రద్ధగా పోషించి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆమె అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆమె చూపిన సానుభూతి, మానవతా గుణాలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని, ఆమె సాన్నిహిత్యాన్ని పొందిన ప్రతి ఒక్కరు గౌరవంతో, ప్రేమతో ఆమెను స్మరించుకుంటారని అన్నారు. అలాగే కుటుంబ సభ్యులకు ఆమె అందించిన విలువలు, నడిపించిన మార్గదర్శనం ఎప్పటికీ వారికి ప్రేరణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆమెతో గడిపిన మధుర జ్ఞాపకాలు ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, మనోబలాన్ని అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చీటి సకలమ్మ అకాల మృతి పట్ల తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని తెలిపారు. ఈ విషాద క్షణాలను అధిగమించే శక్తి, సహనాన్ని కుటుంబ సభ్యులు పొందాలని మోడీ లేఖలో ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!