తెలంగాణ రాష్ట్రం గ్రీన్ పవర్ రంగంలో అద్భుత విజయాలను సాధించి, దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, ఉత్పత్తి, వ్యవసాయా రంగాల అభివృద్ధికి కేంద్రంగా ఉద్భవించిందని తెలిపారు.
హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభ నిర్వహించారు. ముఖ్య అతిధిగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 80 బీసీ సంఘాల నాయకులు కూడా సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు యధావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
KTR Press Meet: శుక్రవారం నాడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతుబంధు పథకం సంబంధించి అనేక విషయాలను తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత, ప్రత్యేకమైన విధానాలు అమలు చేస్తూ.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక కీలక చర్యలు తీసుకున్నారన్నారు. ముఖ్యంగా, తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో అభూతపూర్వమైన చర్యలను ప్రారంభించమని, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. నీది నాలుక తాటి మట్ట.. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబంతో కూడి పొగిడిన వ్యక్తివి నువ్వు కాదా అని దుయ్యబట్టారు. అవకాశవాది నుంచి అవినీతి మాట రావడం సిగ్గుచేటు అని అన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డి సానుభూతి పొందడానికే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాజయ్య అన్నారు.
ప్రజాభవన్లో మంత్రి సీతక్క జెండా ఊపి 25 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భార్యభర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి.. ఇద్దరూ చేయాల్సిందేనని అన్నారు. మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం.. నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారు చేయండని సూచించారు.
నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం కలకలం రేపుతోంది. నవీపేట్ మండలంలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు పాఠశాలకు వెళ్తొస్తామని చెప్పి మిస్సింగ్ అయ్యారు.
ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. చలికి జనం గజగజ వణుకుతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోయాయి. రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు చేసుకుంది.